https://oktelugu.com/

ఓటీటీ వద్దు మహా ప్రభో ఆంటోన్న లెజెండరీ క్రికెటర్ !

బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రానున్న లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కి ఓటిటీలో రిలీజ్ అవ్వబోతున్నట్లు.. గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మేకర్స్ రావట్లేదు మహా ప్రభో అని క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. నిజానికి ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చిందనేది వాస్తవం. ఓ దశలో ఈ సినిమా మేకర్స్ కూడా ఓటీటీకి […]

Written By:
  • admin
  • , Updated On : November 5, 2020 / 07:36 PM IST
    Follow us on


    బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రానున్న లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కి ఓటిటీలో రిలీజ్ అవ్వబోతున్నట్లు.. గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మేకర్స్ రావట్లేదు మహా ప్రభో అని క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. నిజానికి ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చిందనేది వాస్తవం. ఓ దశలో ఈ సినిమా మేకర్స్ కూడా ఓటీటీకి తమ సినిమాని అమ్ముకోవడానికి రెడీ అయ్యారు. కానీ, సంక్రాంతికి థియేటర్లు రెడీగా ఉండే అవకాశం కనిపించడంతో మళ్లీ మేకర్స్ ఆలోచనలో పడ్డారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

    దాంతో సినిమాని ఓటీటీకి అమ్మే వ్యవహారానికి సంబంధించిన చర్చలను మధ్యలోనే ఆపేశారు. థియేటర్లలోనే తమ సినిమాని పాన్ ఇండియా విడుదలకు సిద్ధం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా మార్చిలో రిలీజ్ అవ్వాలి. కానీ, కరోనా మహమ్మారి రాకతో కపిల్ అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ పడింది. ఆ తరువాత ఈ సినిమాని మేకర్స్ అమెజాన్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే ఓటీటీ అయితే సినిమాకి న్యాయం జరగదు అనేది చిత్రబృందం అభిప్రాయం.

    Also Read: క్రేజీ రూమర్ : ఛత్రపతి శివాజీగా మహేష్ బాబు !

    ఎందుకంటే తమ సినిమాలో మొత్తం 80 నాటి కాలం సంగతులను పరిస్థితులను అప్పటి నేపథ్యం తాలూకు విజువల్స్ ఎక్కువగా ఉంటాయని.. ప్రేక్షకులను 80 నాటి కాలంలోకి తీసుకువెళ్లాలన్నా.. సినిమాలోని ఫీల్ ను వాళ్లు ఇంకా బాగా ఓన్ చేసుకోవాలన్నా.. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్ లోనే చూడాలి. అందుకే తమ సినిమాని నేరుగా థియేటర్స్ లోనే విడుదల చేస్తామని ఇప్పటికే పలుమార్లు స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్. అయినా ఓటీటీలో రిలీజ్ అవుతుంది అంటూ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అందుకే మేకర్స్ మరోసారి క్లారిటీ ఇస్తూ.. మా సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయము అని స్పష్టం చేశారు.