Beast Box Office Collection: తమిళ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడి స్టార్ హీరోల సినిమాలకు కూడా పోటీ ఇస్తుంటాయి. అంతలా ఆయన ఇక్కడ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇకపోతే ఆయన నటించిన బీస్ట్ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగులో విడుదలైంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మోడ్ లో ఉన్న ఈ మూవీకి విపరీతమైన హైప్ వచ్చింది.
అయితే ఈ మూవీ తెలుగులో భారీ ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీకి తెలుగులో కూడా మంచి హైప్ రావడంతో రూ.10కోట్ల మేర తెలుగులో బిజినెస్ చేసింది. కాగా కేజీఎఫ్-2కు పోటీగా వచ్చిన ఈ మూవీకి మొదట్లో బాగానే కలెక్షన్లు వచ్చాయి. అయితే నాలుగోరోజు మాత్రం కాస్త వెనకబడిపోయింది. మరి ఈరోజు ఎంత వసూలు చేసిందో చూద్దాం.
Also Read: Chiranjeevi Acharya Pre Release Event: ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి ఎవరో తెలుసా?
బీస్ట్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు నైజాంలో రూ.7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.5 లక్షలు వసూలు చేసింది. ఇక సీడెడ్‌లో రూ.4 లక్షలు, ఈస్ట్‌లో రూ.1 లక్షలు.. ఇలా అన్ని ఏరియాల్లో కలిపి మొత్తంగా రూ. 21 లక్షల షేర్ తో పాటు రూ.45 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా చూసుకుంటే నాలుగు రోజులకు రూ.6.79 కోట్లు షేర్ వసులు చేయగా.. రూ.12.10 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.10.50 కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు నాలుగు రోజులకు కలిపి 6.79 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ.3.71 కోట్లు వస్తే హిట్ ట్రాక్ లోకి వస్తుంది. కానీ ఈ మూవీకి అంతగా పాజిటివ్ టాక్ రాలేదు. పైగా కేజీఎఫ్-2 వేవ్‌లో ఈ మూవీ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.
Also Read:BJP vs KCR: బీజేపీపై మాటలకే పరిమితమా కేసీఆర్.. చంద్రబాబు, జగన్ ఎందుకీ మౌనదీక్ష..?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read More