https://oktelugu.com/

Devara Trailer Review: దేవర ట్రైలర్ రివ్యూ: కథ మొత్తం చెప్పేసిన కొరటాల, గూస్ బంప్స్ రేపే విజువల్స్, హైలెట్స్ ఇవే!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ వచ్చేసింది. రెండున్నర నిమిషాలకు పైగా నిడివి కలిగిన ట్రైలర్ గూస్ బంప్స్ రేపింది. తండ్రి కొడుకు పాత్రల్లో ఎన్టీఆర్ రెండు భిన్నమైన షేడ్స్ చూపించాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : September 10, 2024 / 05:33 PM IST

    Devara Trailer Review

    Follow us on

    Devara Trailer Review: ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న చిత్రం దేవర. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ క్రమంలో దేవర ట్రైలర్ విడుదల చేశారు. దేవర ట్రైలర్ నటుడు ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో మొదలైంది. రెండున్నర నిమిషాలకు పైగా నిడివి కలిగిన ట్రైలర్ లో మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలతో సాగింది.

    ట్రైలర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ అని చెప్పొచ్చు. సముద్రం నేపథ్యంలో తెరకెక్కిన విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. కొన్ని షాట్స్ తో దర్శకుడు కొరటాల ప్రతిభ కనబడుతుంది. రౌడీ మూకలను ఊచకోత కోస్తున్న ఎన్టీఆర్ ఫెరోషియస్ లుక్ ఫ్యాన్స్ కి ఫీస్ట్. ట్రైలర్ ని ఎలివేట్ చేసిన మరొక అంశం అనిరుధ్ బీజీఎమ్. తనపై దర్శకుడు ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ అనిరుధ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.

    కాగా దర్శకుడు కొరటాలశివ ట్రైలర్ లో కథ మొత్తం చెప్పేశారు. సైఫ్ అలీ ఖాన్-ఎన్టీఆర్ స్నేహితులుగా కనిపిస్తున్నారు. సముద్ర దొంగలుగా ఒక ముఠా చేస్తున్న అరాచకాలకు చెక్ పెట్టేందుకు దేవర రంగంలోకి దిగుతాడు. స్నేహితుడికి వెన్నుపోటు పొడిచేవాడిగా సైఫ్ అలీ ఖాన్ పాత్ర ఉంది. ఇక దేవర కొడుకును పిరికి వాడిగా పరిచయం చేశారు. జాన్వీ కపూర్ ని కేవలం ఒక షాట్ లో చూపించారు.

    మొత్తంగా దేవర ట్రైలర్ ఆకట్టుకుంది. అంచనాలు పెంచేసింది. ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, సుధా ఆర్ట్స్ సంయుక్తంగా దేవర చిత్రాన్ని నిర్మిస్తున్నారు.