spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఫొటోలుPawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓజీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతుందా..? అసలు...

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓజీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతుందా..? అసలు ఇది ఎప్పుడు పూర్తవుతుంది..?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కూడా కొనసాగిస్తున్నాడు. ఇక ఒకప్పుడు ఆయన భారీ స్టార్ డమ్ ని అందుకొని స్టార్ హీరో రేస్ లో ముందుకు దూసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు పొలిటిషన్ గా మారి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తను డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను చేపట్టకముందు నుంచి కూడా ఆయన చేస్తున్న కొన్ని సినిమాలు  సెట్స్ మీదే ఉండిపోయాయి. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీదనే ఉంది. ఆయన ఎలాగైనా సరే వీలైనంత తొందరగా ఈ సినిమాని పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ కొంతవరకు నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.
సుజిత్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తొందరగా పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి పవన్ కళ్యాణ్ మాత్రం ‘హరిహర వీరమల్లు’ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఓజీ సినిమా మీద తన ఫోకస్ ను పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే సుజిత్ ఈ సినిమా మీద దాదాపు మూడు సంవత్సరాలుగా వర్క్ చేస్తూనే ఉన్నాడు. అయిన కూడా ఇప్పటికీ ఈ సినిమా అయితే ఒక కొలిక్కి రాలేదు. అయినప్పటికీ అది ఎప్పుడు పూర్తవుతుందనే విషయంలో కూడా సరైన క్లారిటీ అయితే లేదు. కాబట్టి సుజిత్ ఈ సినిమా మీద చాలా విసిగిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అందుకే తను బయట వేరే హీరోలను అప్రోచ్ అవుతూ వాళ్లకి కథలను కూడా వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక నానితో ఒక సినిమా స్టార్ట్ చేయాలని చూసిన సుజిత్ ఆ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో ఆయన భారీ ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక పార్లల్ గా ఇటు ఈ సినిమా చేస్తూనే అటు మరొక సినిమా కూడా చేసి సక్సెస్ సాధించాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే హరీష్ శంకర్ కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను  పక్కన పెట్టి రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా కూడా రేంజ్ లో ఆడలేదు. ఇప్పుడు రామ్ తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు…
Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version