Homeఎంటర్టైన్మెంట్సినిమా ఫొటోలుNTR Koratas Devara 2 : ఎన్టీయార్ కొరటాల మధ్య గొడవలు జరిగాయా..? దేవర 2...

NTR Koratas Devara 2 : ఎన్టీయార్ కొరటాల మధ్య గొడవలు జరిగాయా..? దేవర 2 మీద క్లారిటీ ఇవ్వలేకపోవ్వడానికి కారణం ఏంటి..?

 NTR Koratas Devara 2 : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా 500 కోట్ల వరకే కలెక్షన్లను రాబతట్టింది. ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాతో వెయ్యి కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టాలని ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అది సాధ్యపడలేదు. మరి ఇలాంటి సందర్భంలో కొరటాల శివ ఇచ్చిన సక్సెస్ పట్ల ఆయన సంతృప్తి చెందలేదు. కాబట్టి దేవర 2 సినిమా ఎప్పుడు ఉంటుంది అనేదానిమీద సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇక ఈ రకంగా ఎన్టీఆర్ కొరటాల మధ్య కూడా కొంత గ్యాప్ అయితే పెరిగిందని వాళ్ళ మధ్య చిన్న గొడవలు కూడా జరుగుతున్నాయి అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో దేవర 2 సినిమా చేసే ఆలోచనలో ఇద్దరూ ఉన్నారా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలను కొరటాల శివ హాండిల్ చేయగలడు. కానీ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలను అంత బాగా డీల్ చేయలేడనే విషయం అయితే దేవర సినిమాతో స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి కొరటాల శివ ఇప్పుడు దేవర 2 సినిమాను పక్కనపెట్టి మరొక హీరోతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా వరుస సినిమాతో బిజీ అయిపోయాడు.
ఇంకా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమా మీద తన పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ,  జూనియర్ ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ రూపంలో ఒక మంచి సక్సెస్ ని అందించాడు. ఇప్పుడు దేవర సినిమాతో కూడా ఒక డీసెంట్ సక్సెస్ అయితే ఇచ్చాడు.
కాబట్టి రెండు సక్సెస్ లను అందించిన ఈ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మరొక సినిమా చేయాలని తన అభిమానులైతే కోరుకుంటున్నారు. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న దేవర 2 సినిమా ఉంటుందా? ఉండదా అనే విషయం మీద క్లారిటీ రావాలంటే మాత్రం సినిమా యూనిట్ నుంచి ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరమైతే ఉంది…
సినిమా మీద ప్రొడ్యూసర్ అయిన నందమూరి కళ్యాణ్ రామ్ స్పందిస్తాడు అంటూ కొద్దిరోజులుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఆయన కూడా ఎలాంటి స్పందన తెలియజేయకపోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక సందిగ్ధత అయితే నెలకొంది…
Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Oktelugu Epaper
Exit mobile version