Devara Trailer : టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని మాత్రమే కాదు, యూట్యూబ్ రికార్డ్స్ ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు అభిమానులు. యూట్యూబ్ రికార్డ్స్ అత్యధిక శాతం పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ మధ్యనే ఉంటాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య లైక్స్ విషయం లో నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఉంటుంది. ‘దేవర’ చిత్రం ట్రైలర్ కూడా యూట్యూబ్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొడుతుందని అనుకున్నారు. కానీ దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ ‘సలార్’ ట్రైలర్ రికార్డ్స్ ని బద్దలు కొట్టలేకపోయింది. ‘భీమ్లా నాయక్’ మరియు ‘సలార్’ చిత్రాలకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్స్ కేవలం 3 నిమిషాల్లోనే లక్షకు పైగా లైక్స్ ని సాధించాయి. కానీ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి 9 నిమిషాలకు పైగానే సమయం పట్టింది. 24 గంటల్లోనే అయినా ఈ రెండు సినిమాల రికార్డ్స్ ని బద్దలు కొడుతాడేమో అని అనుకుంటే అది కూడా జరగలేదు.
24 గంటల్లో ‘భీమ్లా నాయక్’, ‘సలార్’ చిత్రాలు 1 మిలియన్ కి పైగా లైక్స్ సాధిస్తే, ‘దేవర’ చిత్రానికి కేవలం 6 లక్షల లైక్స్ మాత్రమే వచ్చాయి. మరో దారుణమైన సంఘటన ఏమిటంటే, ఈ చిత్రానికి 24 గంటల్లో కేవలం 10 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. కొరటాల శివ గత చిత్రం ‘ఆచార్య’ ట్రైలర్ కి 24 గంటల్లో 21 మిలియన్ వ్యూస్ రాగా, దేవర చిత్రానికి అందులో సగం కూడా రాలేదు. రెండు రోజులైనా కూడా ఆచార్య మొదటి రోజు వ్యూస్ కౌంట్ ని అందుకుంటుందా అంటే అనుమానమే. లైక్స్ కూడా ‘ఆచార్య’ ట్రైలర్ కి 24 గంటల్లో 8 లక్షలకు పైగా లైక్స్ వస్తే, దేవర కి కేవలం 6 లక్షల లైక్స్ మాత్రమే వచ్చాయి. దీనికి ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురి అయ్యారు. ట్రైలర్ పై ట్రోల్ల్స్ వచ్చినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు కానీ, ట్రైలర్ కి ఆశించిన స్థాయిలో వ్యూస్ రాకపోవడం పై మనస్తాపానికి గురి అయ్యారు. సినిమా మీద ఉన్న హైప్ మొత్తాన్ని నాశనం చేస్తున్నారని, అర్జెంటు గా సినిమాలోని ‘ఆయుధ పూజ’ సాంగ్ ని విడుదల చెయ్యాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకంటే ఈ సాంగ్ అద్భుతంగా వచ్చిందట. విడుదలైన తర్వాత కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, సౌత్ ఇండియా షేక్ అవుతుందని అంటున్నారు. ట్రైలర్ తో ఏర్పడిన నెగటివిటీ మొత్తం ఈ పాటతో కొట్టుకొని పోతుందని, అభిమానులు కంగారు పడొద్దని మూవీ టీం సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మూవీ టీం ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతుంది. ముంబై లో త్వరలోనే హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూ లో కనిపించబోతున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్.