Homeఆంధ్రప్రదేశ్‌ Telugu Film Industry : ఏపీకి తెలుగు చిత్ర పరిశ్రమ.. టాలీవుడ్ సిద్ధమేనా?

 Telugu Film Industry : ఏపీకి తెలుగు చిత్ర పరిశ్రమ.. టాలీవుడ్ సిద్ధమేనా?

Telugu Film Industry : తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి వస్తుందా?అందుకు తగ్గట్టు ఇక్కడ పరిస్థితులు ఉన్నాయా? ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సంబంధిత శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలిరావాలని పిలుపునిచ్చారు. వాస్తవానికి ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. సినీ పరిశ్రమ ఏపీకి వస్తుందని అంతా ఆశించారు. సినీ పరిశ్రమ ఎంతో ఇష్టపడే చంద్రబాబు సీఎం కాగా..స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో టాలీవుడ్ కు ఏపీలో మంచి రోజులు వచ్చాయని అంతా భావించారు. మొన్న ఆ మధ్యన సినీ ప్రముఖులు వచ్చి డిప్యూటీ సీఎం కలిశారు. పవన్ కళ్యాణ్ తో పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తామని కూడా చెప్పారు. కల్పిస్తానని కూడా పవన్ హామీ ఇచ్చారు. అయితే తాజాగా మంత్రి కందుల దుర్గేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి వచ్చి మాట్లాడాలని పరిశ్రమ ప్రతినిధులకు సూచించారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి వెళ్తుందా? హైదరాబాదు నుంచి టాలీవుడ్ ను కదపగలరా? అనే చర్చ అయితే బలంగా జరుగుతోంది.అయితే ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరణకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి. ఇప్పటికే అవుట్ డోర్ షూటింగ్స్ జరుగుతున్నాయి. సినిమాల చిత్రీకరణకు అవసరమైన వసతులు కల్పిస్తే..తప్పకుండా సినీ పరిశ్రమ ఏపీకి వచ్చి తీరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* అప్పట్లో చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్
ఎన్నో దశాబ్దాల కిందట చెన్నై నుంచి హైదరాబాద్కు తరలివచ్చింది చిత్ర పరిశ్రమ. అయితే హైదరాబాదులో చిత్ర పరిశ్రమ స్థిరపడేందుకు చాలా సంవత్సరాలు పట్టింది. దశాబ్దాల కిందట నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో కట్టారు. మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు.వెంటనే రామానాయుడు,ఎన్టీఆర్, కృష్ణ వంటి దిగ్గజాలు స్టూడియో లను నిర్మించారు..నాటి ప్రభుత్వాలు కూడా చిత్ర పరిశ్రమకు ఎన్నో రకాల రాయితీలు ప్రకటించాయి. ప్రోత్సాహం అందించాయి.హైదరాబాదులో చిత్ర పరిశ్రమ విస్తరించేందుకు అందరూ కృషి చేశారు. ప్రస్తుతం వేలాదిమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా చిత్ర పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. రామోజీ ఫిలిం సిటీ రాకతో హైదరాబాద్కు చిత్ర నిర్మాణ రంగంలో తిరుగులేకుండా పోయింది.

* అనువైన స్పాట్లు ఎన్నో
అయితే ఇప్పుడు ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరణ జరగాలన్నది అందరి ఆలోచన.అందుకు తగ్గట్టుగా విశాఖ,విజయవాడ, తిరుపతి నగరాలతో పాటు ఉభయగోదావరి జిల్లాలు ఉన్నాయి.విశాఖ మన్యంలో కూడా అనువైన ప్రాంతాలు ఉన్నాయి. అందుకే చిత్ర పరిశ్రమ ఏపీకి రావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వాస్తవానికి టాలీవుడ్ కు 60 శాతానికి పైగా ఆదాయం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వస్తోంది. విశాఖలో ఇప్పటికీ రామానాయుడు స్టూడియో ఉంది. పర్యాటక స్పాట్లు ఉన్నాయి. కోనసీమలో సైతం అందమైన షూటింగ్ స్పాట్స్ కు కొదువ లేదు. అయితే తాజాగా మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన చూస్తుంటే.. చిత్ర పరిశ్రమ విషయంలో కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version