https://oktelugu.com/

Heroine Saiee Manjrekar: ఈ రెండు చిత్రాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందా…

Heroine Saiee Manjrekar:ఈ ఏడాది బాలీవుడ్ ముద్దుగుమ్మలు టాలీవుడ్ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆలియా భట్ “ఆర్ ఆర్ ఆర్”, అనన్య పాండే” లైగర్” మరో బాలీవుడ్ బ్యూటీ అయిన సయీ మంజ్రేకర్ టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతోంది.బాలీవుడ్‌లో సూపర్ హిట్ సిరీస్ ‘దబాంగ్’ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది మంజ్రేకర్ తాజాగా టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు. ప్రస్తుతం ఈ భామ తెలుగు […]

Written By: , Updated On : December 25, 2021 / 04:20 PM IST
Follow us on

Heroine Saiee Manjrekar:ఈ ఏడాది బాలీవుడ్ ముద్దుగుమ్మలు టాలీవుడ్ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆలియా భట్ “ఆర్ ఆర్ ఆర్”, అనన్య పాండే” లైగర్” మరో బాలీవుడ్ బ్యూటీ అయిన సయీ మంజ్రేకర్ టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతోంది.బాలీవుడ్‌లో సూపర్ హిట్ సిరీస్ ‘దబాంగ్’ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది మంజ్రేకర్ తాజాగా టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు.

Actress sai manjrekar hopes on her upcoming movies
ప్రస్తుతం ఈ భామ తెలుగు రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.గూఢచారి ఫేం శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో”మేజర్ ” సినిమాలో అడివి శేష్ హీరోగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు ఈ ముద్దుగుమ్మ.26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అమరవీరుడైన ఎన్.ఎస్.జి కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తోంది.అలానే మెగా హీరో వరుణ్ తేజ్ సరసన “గాని” చిత్రంలోనూ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఇందులో ఈ అమ్మడు గ్లామర్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. కిరణ్ కుమార్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ వచ్చే ఏడాది మార్చి 18న విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలతో ఈ అమ్మడు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ని అందుకుంటుందో చూడాలి మరి.