అయ్యో.. వ్యభిచారంలోకి సినీ ఆర్టిస్టులా !

కరోనా.. గత కొన్ని నెలలుగా మన బుర్రలను పట్టి పీడిస్తోన్న అతి చిన్న వైరస్. ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచానికే ప్రమాదకరంగా మారిన ఈ వైరస్‌ సినిమా ఇండస్ట్రీకి థియేటర్ల వ్యవస్థకు పెద్ద శాపంగా మారింది. ఇప్పటికే థియేటర్లను నమ్ముకుని బతికే కార్మికులు కూలీ పనులకు పోతున్నారు. ఇంతకన్నా మరో బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ లుగా పని చేస్తోన్న అమ్మాయిలు బతుకు బండిని కరోనా కోరలకు బలి చేయలేక.. వ్యభిచార రొంపిలోకి వెళ్తున్నారట. […]

Written By: admin, Updated On : August 2, 2020 12:58 pm
Follow us on


కరోనా.. గత కొన్ని నెలలుగా మన బుర్రలను పట్టి పీడిస్తోన్న అతి చిన్న వైరస్. ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచానికే ప్రమాదకరంగా మారిన ఈ వైరస్‌ సినిమా ఇండస్ట్రీకి థియేటర్ల వ్యవస్థకు పెద్ద శాపంగా మారింది. ఇప్పటికే థియేటర్లను నమ్ముకుని బతికే కార్మికులు కూలీ పనులకు పోతున్నారు. ఇంతకన్నా మరో బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ లుగా పని చేస్తోన్న అమ్మాయిలు బతుకు బండిని కరోనా కోరలకు బలి చేయలేక.. వ్యభిచార రొంపిలోకి వెళ్తున్నారట. నిజంగా ఇది అత్యంత బాధ పెట్టే సంఘటనలే. వారి కన్నీటి మరకల చాటు మాటు వ్యవహారాలను ఎవ్వరూ పరిష్కరించలేరు. అలా అని తప్పుడు మార్గంలోకి వెళ్తుంటే చూస్తూ ఉండలేము. కాబట్టి ప్రభుత్వమే సినిమా ఇండస్ట్రీలోని అమ్మాయిలను, కార్మికులను ఆదుకోవాలి. కనీసం వాళ్ళు పస్తులతో సావాసం చెయ్యకుండా ప్రభుత్వం కనీస ఆర్ధిక సహాయం చేసినా.. ఎన్నో బతుకులు చీకటి కాకుండా ఉంటాయి.

Also Read: అది మెగాస్టార్ గొప్పతనం అంటే.. !

ఇక కరోనా తీవ్రత భారత్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న కారణంగా సినిమాల పరిస్థితి ఇప్పట్లో మాములు స్థితికి వచ్చే అవకాశం లేదు. సాటి వారి కష్టాలను చూసి చూడనట్టుగా సర్దుకుపోవాల్సిన స్థితి ఒక్క కరోనాతోనో సాధ్యం అయిందని సరిపెట్టకుండా.. సినీ పెద్దలు ఇంకా సాయం అందించాలి. ఐదు నెలలకు రెండు సార్లు సరుకులు ఇస్తే సరిపోదు. ఏ.. కోట్లు తీసుకునే హీరోలు తమ ఇండస్ట్రీలోని పేదలను ఆదుకోలేరా.. వాళ్ళ తీవ్ర ఇబ్బందులను పూర్తిగా తీర్చలేకపోయినా.. కొంతవరకైనా సాయం అందించాలి కదా. నిజమే.. సినిమా రంగం పై కరోనా పంజా విసిరింది. దాని వల్ల రోడ్డున పడింది ఎవరు.. సినీ కార్మికులే కదా. కార్మికులు లేకపోతే సినిమాలు చేయలేరు. ఇప్పుడు ఇలాగే కరోనా మరో ఐదారు నెలలు ఉంటే ఇక ఇండస్ట్రీని నమ్ముకుని ఒక్క కార్మికుడు ఉండదు.

Also Read: హమ్మయ్య ఎట్టకేలకు హీరో దొరికాడు !

అయినా పని లేనప్పుడు.. పొట్ట నిండనప్పుడు ఎందుకు ఇండస్ట్రీలో ఉండాలి. షూటింగ్లు జరపకుండా ఇంకా పంజా ఎప్పుడు విసురుదామా అని కాచుకుని కూర్చున్న కరోనాకి ఎందుకు బలి అవ్వాలని కార్మికులందరూ అనుకుంటే… సినిమాల షూటింగ్ లన్నీ ఆపేయాల్సిందేగా. అప్పుడు కృష్ణ నగర్ కష్టాలు సినిమా పెద్దల్లో ఎక్కువైపోతాయి. కాబట్టి సినీ పెద్దలు.. మరో నాలుగు నెలలు షూటింగ్ లు లేకపోయినా… సినీ కార్మికులు కడుపు నింపండి. అలాగే ఇప్పటికే చిన్న సినిమాల్లో తమ డబ్బులు ఖర్చు పెట్టిన చిన్న నిర్మాతలకు అండగా ఒక భరోసాను కల్పించండి. ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్ట్ లైనా అమ్మాయిలు పక్కదారి పట్టకుండా పెద్ద మనసు చూపండి.