https://oktelugu.com/

అభిజీత్ నిర్ణయానికి సినీ పెద్దలే ఆశ్చర్యపోతున్నారట !

“లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అభిజీత్ కి, ఆ సినిమా పెద్దగా హిట్టవ్వకపోయినా మంచి గుర్తింపు అయితే తెచ్చింది. ఆ తరువాత మిర్చి లాంటి కుర్రోడు, రామ్ లీల లాంటి సినిమాలు చేసినప్పటికీ కెరీర్ పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత “పెళ్లిగోల ” వెబ్ సిరీస్ తో బాగానే అలరించినా, హీరోగా మాత్రం నిలబడలేకపోయాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని అనుకోవడం […]

Written By:
  • admin
  • , Updated On : January 2, 2021 / 10:35 AM IST
    Follow us on


    “లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అభిజీత్ కి, ఆ సినిమా పెద్దగా హిట్టవ్వకపోయినా మంచి గుర్తింపు అయితే తెచ్చింది. ఆ తరువాత మిర్చి లాంటి కుర్రోడు, రామ్ లీల లాంటి సినిమాలు చేసినప్పటికీ కెరీర్ పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత “పెళ్లిగోల ” వెబ్ సిరీస్ తో బాగానే అలరించినా, హీరోగా మాత్రం నిలబడలేకపోయాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని అనుకోవడం లేదట ఈ యంగ్ హీరో.

    Also Read: క్రేజ్ ను బాగా క్యాష్ చేసుకుంటుంది !

    మరోపక్క ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లు, ఒక మూవీ ఆఫర్ ని అభిజీత్ అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ ఒక్కసారిగా అభిజీత్ లైఫ్ ని చేంజ్ చేసిందనే అంతా అనుకుంటున్న టైంలో.. అభిజీత్ తీసుకున్న నిర్ణయం అందర్నీ షాక్ కి గురి చేసింది. నిజానికి బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో విన్నర్‌ అయ్యాక, తన దృష్టి మొత్తం సినిమాల్లో రాణించడంపైనే ఉందని ఎన్నోసార్లు చెప్పాడు అభిజీత్. దానికితగ్గట్లుగానే అభిజీత్ కి సినిమాల అవకాశాలు కూడా వచ్చాయి. అయితే, ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో అభిజీత్ ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్నాడట.

    Also Read: మహేష్, ప్రభాస్ వద్దు అన్న కథతోనే.. బాలీవుడ్ స్టార్ !

    ఇప్పటివరకూ ఒక్క సినిమాను కూడా ప్రకటించలేదు అభిజీత్. పైగా అభిజీత్ తన మూవీ విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడట. భారీ సినిమా ద్వారానే టాలీవుడ్‌కు రీలాంఛ్ అవ్వాలని అభిజీత్ నిర్ణయించుకున్నాడట. అలాంటి మూవీ వచ్చే వరకూ రీఎంట్రీ ఇవ్వకూడదని.. అందుకే వస్తున్న చిన్న సినిమాలను, వెబ్ సిరీస్‌లను అభిజీత్ రిజెక్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి అభిజీత్ తీరుకు సినీ పెద్దలే ఆశ్చర్యపోతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్