దేశరాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని మోతీనగర్ ప్రాంతంలో ఓ భవనంలోని మొదటి, రెండో అంస్థులో ఉన్న ఓ షోరూంలో శనివారం తెల్లవారుజామున మంటలు లేచాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 25 ఫైరింజన్లను సంఘటనా స్థలానికి తీసుకొచ్చారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న మహ్మద్ షాబాద్, ధీరేందర్, కిరణ్, రియా అనే నలుగురిని రక్షించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు వెల్లడించారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్, బేస్మెంట్ […]
దేశరాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని మోతీనగర్ ప్రాంతంలో ఓ భవనంలోని మొదటి, రెండో అంస్థులో ఉన్న ఓ షోరూంలో శనివారం తెల్లవారుజామున మంటలు లేచాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 25 ఫైరింజన్లను సంఘటనా స్థలానికి తీసుకొచ్చారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న మహ్మద్ షాబాద్, ధీరేందర్, కిరణ్, రియా అనే నలుగురిని రక్షించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు వెల్లడించారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్, బేస్మెంట్ భాగాలు దెబ్బతిన్నాయని వారు పేర్కొన్నారు.