Homeఎంటర్టైన్మెంట్Christopher Nolan: ది గ్రేట్ క్రిస్టోఫర్ నోలన్ కు నచ్చిన భారతీయ దర్శకుడు ఎవరో తెలుసా...

Christopher Nolan: ది గ్రేట్ క్రిస్టోఫర్ నోలన్ కు నచ్చిన భారతీయ దర్శకుడు ఎవరో తెలుసా…

Christopher Nolan: క్రిస్టోఫర్ నోలన్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రముఖ దర్శకుడిగా తనదైన శైలిలో చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో భాగంగా ఇటీవల విడుదలైన ‘ది ఒడిస్సీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మతి పోగొట్టే కలెక్షన్లను రాబట్టుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన దీనిపై ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఇంతటి అద్భుతాన్ని తీసిన ఈ డైరెక్టర్ ఓ భారతీయ దర్శకుడిని తెగ మెచ్చేసుకుంటున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

‘ది ఒడిస్సీ’ మూవీ ప్రచార కార్యక్రమంలో భాగంగా నోలన్.. ఇటీవల కైటీరియల్ క్లోసెట్ ను సందర్శించారు. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన 1000కి పైగా సినిమాలను భద్రపరిచారు. ఇది న్యూయార్క్ లో ఉంది. దీనిని సందర్శించిన సందర్భంగా నోలన్ ఎంచుకున్న చిత్రాల్లో భారతీయ సత్యజిత్ రే తెరకెక్కించిన ‘ది ఆపు ట్రైలజీ’ ఉంది. దీని గురించి ఆయన మాట్లాడుతూ ఈ ట్రైలజీ పథేర్ పాంచాలితో ప్రారంభం అవుతంది. ఇది ఒక అద్భుతమైన చిత్రం. ఇది నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. నేనింకా ట్రైలజీలో రెండు, మూడు భాగాలు చూడలేదు. దీనిని పూర్తి చేయడానికి ఉత్సాహాంగా ఉన్నాను.. అని ఆయన అన్నారు.

సత్యజిత్ రే రూపొందించిన ‘ది ఆపు ట్రైలజీ’లో మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఒకటి పథేర్ పాంచాలి, అపరాజితో, అపూర్ సంసార్. ఈ మూడు సినిమాలు బెంగాల్ గ్రామీణ ప్రజల సాధారణ జీవితాన్ని చూపిస్తాయి. పేదరికం, కుటుంబ బంధాలు, బాల్యం వంటి విషయాలు సహజంగా ఉండేలా ఇందులో చూపించారు. ఈ సినిమాలకు విమర్శకుల చేత ప్రశంసలు పొంది ఎన్నో అవార్డులను తీసుకువచ్చాయి.

సత్యజిత్ రే తొలి చిత్రం పథేర్ పాంచాలి. ఈ సినిమా సినీ ప్రస్థానాన్నే కాదు.. భారతీయ సినిమాను కూడా ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. గ్రామీణ బెంగాల్ లోని ఓ సాధారణ కుటంబ జీవితం ఎలా ఉంటుందో ఇందులో అద్భుతంగా చూపించారు. ఇవే కాకుండా ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన సత్యజిత్ రే ను భారతరత్నతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వరించాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు నోలన్ ప్రశంసలతో ఆయన గురించి మరోసారి చర్చకు వచ్చింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Hardik Pandya

Hardik Pandya: హార్దిక్ చెప్పినట్టు.. సీఎస్కే మేనేజ్మెంట్ ఆడుతోంది.. ఏం జరుగుతుందో..

Hardik Pandya: గొప్ప ఆటగాడే. గతంలో గుజరాత్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. మరోసారి ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత మనోడి ఆట మారిపోయింది. బౌలింగ్ తన స్థాయిలో...
RHA Movement

RHA Movement: దేశవ్యాప్తంగా మరో ఉద్యమం.. ఈసారి అదే లక్ష్యం!

RHA Movement: సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా ఉద్యమించిన సీజీపీ నీటి...
YSRCP Rayalaseema

YSRCP Rayalaseema: రాయలసీమలో వైసీపీకి కష్టమే!

YSRCP Rayalaseema: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధీమా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని.. పూర్వవైభవం ఖాయమని జగన్మోహన్...
AP MLC Elections 2026

AP MLC Elections 2026: రేపటితో ఆ ఇద్దరు.. ఏపీలో మొదలుకాని ఎమ్మెల్సీ ఎన్నికల సందడి!

AP MLC Elections 2026: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈనెల 28 తో గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి సంబంధించి ఎన్నికల సంఘం...
Ellamma Cheruvu

Ellamma Cheruvu: కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కాదు.. తెలంగాణలో ఈ చెరువే దేశానికి ఆదర్శం

Ellamma Cheruvu: గోదావరి కిందికి పోతుంటే పైకి తీసుకొచ్చాం. వందల మీటర్లు గ్రావిటీకి వ్యతిరేకంగా ప్రవహించేలా చేసాం. లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. తాగునీటి అవసరాలు తీర్చాం. సాగునీటి అవసరాలు తీర్చాం....
Oktelugu Epaper