https://oktelugu.com/

విక్రమ్ నుండి క్లారిటీ.. పుష్ప బాధ పోగొట్టేవాళ్లు ఎవరో ?

“అపరిచితుడు”, “శివపుత్రుడు” వంటి సినిమాలలో తన నటనతో సంచలనం సృష్టించిన విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి.. చిన్న చిన్న రోల్స్ నుండి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన గ్రేట్ యాక్టర్ విక్రమ్. అందుకే విక్రమ్ కు తమిళనాట ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. మిగిలిన ఏ హీరోకి లేని పాజిటివ్ ఫీలింగ్ విక్రమ్ కు ఉందని ఆరవ ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ ఉంటారు. పైగా వందల కోట్ల బిజినెస్ ఉన్న హీరో.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : November 28, 2020 / 07:26 PM IST
    Follow us on


    “అపరిచితుడు”, “శివపుత్రుడు” వంటి సినిమాలలో తన నటనతో సంచలనం సృష్టించిన విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి.. చిన్న చిన్న రోల్స్ నుండి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన గ్రేట్ యాక్టర్ విక్రమ్. అందుకే విక్రమ్ కు తమిళనాట ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. మిగిలిన ఏ హీరోకి లేని పాజిటివ్ ఫీలింగ్ విక్రమ్ కు ఉందని ఆరవ ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ ఉంటారు. పైగా వందల కోట్ల బిజినెస్ ఉన్న హీరో.. మరి ఇలాంటి హీరోను విలన్ గా నటించమంటే.. ఎలా ఉంటుంది. అదీ ఏ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమా అయితే.. అనుకోవచ్చు.. కానీ బన్నీ సినిమాలో విలన్ గా నటించమంటే ఎలా ?

    Also Read: బీసీ టైటిల్ తో ఎమోషనల్ మూవీ !

    నిజమే కావొచ్చు గతంతో పోల్చుకుంటే.. విక్రమ్ హవా ఇప్పుడు తగ్గి ఉండొచ్చు.. తెలుగులో కూడా విక్రమ్ క్రేజ్ పోయిందనుకోవచ్చు. అయితే ఎంత క్రేజ్ తగ్గినా, ఎన్ని ఫ్లాప్లు వచ్చినా… విక్రమ్ స్థాయి బన్నీ రేంజ్ కంటే తక్కువేమి కాదు కదా. అందుకే… బన్నీ పుష్ప సినిమాలో విక్రమ్ విలన్ అఫర్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న “పుష్ప” సినిమాలో మొదట విలన్ గా నటించేందుకు విక్రమ్ అంగీకరించినట్లు మీడియాలో వార్తలు రావడం, వాటిని నెటిజన్లు కూడా నమ్మకడంతో విక్రమ్ మేనేజర్ ఈ రిపోర్ట్స్ తోసిపుచ్చుతూ.. విక్రమ్ గారు ఆ సినిమాకి సైన్ చెయ్యలేదని క్లారిటీ ఇచ్చాడు.

    Also Read: ‘పునర్నవి’ వదిలేశాక.. ఐష్ రెడ్డితో డేటింగ్ !

    అయినా వందల కోట్ల హీరోకి విలన్ పాత్రలోకి షిఫ్ట్ అయ్యే అవసరం ఏముంటుంది ? ఏది ఏమైనా పుష్ప సినిమాలో మొదట ఈ పాత్రకి తమిళ్ స్టార్ విజయ్ సేతుపతిని ఒప్పించారు. కానీ ఆ తరువాత ఏమి అయిందో ఏమో గాని సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత నారా రోహిత్ సహా పలువురు సౌత్ ఇండియన్ స్టార్స్ ని అడిగినా.. ఎవ్వరూ బన్నీ చేతిలో తన్నులు తినడానికి రెడీగా లేరు. మరి చూడాలి ఈ విలన్ పాత్రలో ఎవరు నటిస్తారో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్