Homeఎంటర్టైన్మెంట్బీసీ టైటిల్ తో ఎమోషనల్ మూవీ !

బీసీ టైటిల్ తో ఎమోషనల్ మూవీ !

Raju Yadav Movie
“రాజు యాదవ్” అనే బీసీ టైటిల్ తో ఓ సినిమా రాబోతుంది. సమాజంలో వ్యక్తి స్థాయిని చెప్పుకోవడానికి కులాన్ని ఎక్కువగా వాడుకునే పరిస్థితి నేటి కాలనిది. నేను ఫలానా అని చెప్పాలంటే కులం పేరును అర్హతగా వాడుకుంటున్న నేటి తరుణంలో అందులో పక్క వ్యాపారాత్మకంగా మారిన సినిమా పరిశ్రమలో ఓ బీసీ టైటిల్ తో సినిమా తీయడం అంటే నిజంగా సాహసమే. కులం పుట్టుక ఎలా జరిగిందనే విషయం పక్కన పెడితే, అసమానతలను ఎత్తిచూపుతూ ప్రశ్నించేందుకు చేసిన ఏ ప్రయత్నమైనా మెచ్చుకోదగినదే కాబట్టి.. ఈ బీసీ టైటిల్ ను బీసీలు అయినా ఆదరిస్తారేమో చూడలి.

Also Read:  బాలీవుడ్లోకి ‘రేసుగుర్రం’.. పరుగు పెట్టనుందా?

తెలుగులో గొప్ప సినిమాలుగా వచ్చిన పేర్లు వాటి బ్యాక్ గ్రౌండ్ ఏవిధంగా ఉంటుందో ఇప్పటికే మనం చూసాం, అప్పుడెప్పుడో మాల పిల్ల లాంటి పదాలతో ఒకటి రెండు సినిమాలు వచ్చాయి తప్ప, చాలా కాలంగా మళ్ళీ ఇలాంటి పేర్లుతో ఏ సినిమా రాలేదు. తమిళం, మలయాళం లాంటి మిగత భాషలలో కుల వివక్షతో చాలా సినిమాలు వస్తున్నా పేరు మాత్రం వినూత్నంగా ఉంటుంది తప్ప.. మధ్యతరగతి వాళ్ళ కులం పేరుతో సినిమా టైటిల్ పెట్టి సినిమా రాలేదు. కానీ ఇప్పుడు తెలుగులో రాబోతుంది. సామాన్యుడి గోసను చూపించే గొప్ప ప్రయత్నంలో భాగంగా ‘రాజుయాదవ్’ సినిమాని ఏకంగా టైటిల్ గానే ప్రకటించి మన ముందుకొస్తున్నాడు నూతన దర్శకుడు కృష్ణమాచారి.

Also Read: బిగ్ బాస్-4: సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన మొనాల్..!

వ్యాపారాత్మకంగా మారిన సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడూ కళాత్మక చిత్రాలు కనువిందు చేస్తూ మనల్ని ఆలోచింపజేస్తాయి. బలమైన కథ, కథాంశంతో బహుళజాతి మనిషి బాధలను, అతడి బలాలను కూడా పూర్తి స్థాయి పరిణతితో జనానికి చూపించే ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. వీరత్వం కన్నా ఉద్యమం ఉన్నతమైనది. అందుకే రాజు యాదవ్ కేవలం ఆక్రోశాన్ని మాత్రమే ప్రదర్శించకుండా సాధారణ భావోద్వేగాలను కూడా గుండెకు హత్తుకునేలా చూపెట్టబోతున్నాడని దర్శకుడు చెబుతున్నాడు. సూడో రియాలిజం జానర్ లో బుల్లి తెర కమలహాసన్ గా పేరున్న గెటప్ శ్రీను హీరో గా రాజు యాదవ్ తో వస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version