https://oktelugu.com/

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఇకపై పది రోజులు..?

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఈరోజు టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు సమావేశం కాగా ఈ సమావేశంలో భక్తులకు ప్రయోజనం చేకూరేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఒక్కరోజు మాత్రమే భక్తులకు ప్రత్యేక దర్శనం ఉండేది. ఇకపై సంవత్సరానికి పది రోజుల పాటు ప్రత్యేక దర్శనం అమలులోకి రానుంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ఈ మేరకు వెల్లడించారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే వైకుంఠ ద్వారాన్ని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 28, 2020 / 07:30 PM IST
    Follow us on

    తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఈరోజు టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు సమావేశం కాగా ఈ సమావేశంలో భక్తులకు ప్రయోజనం చేకూరేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఒక్కరోజు మాత్రమే భక్తులకు ప్రత్యేక దర్శనం ఉండేది. ఇకపై సంవత్సరానికి పది రోజుల పాటు ప్రత్యేక దర్శనం అమలులోకి రానుంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ఈ మేరకు వెల్లడించారు.

    ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే వైకుంఠ ద్వారాన్ని తెరిచే వాళ్లమని ఈ సంవత్సరం మాత్రం పదిరోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరుస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. పీఠాధిపతులు, మఠాధిపతులతో వైకుంఠ ద్వారాన్ని తెరిచే విషయమై చర్చించామని వారు అందుకు అంగీకరించారని అన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధించడంలో మంచి ఫలితాలు సాధించామని పేర్కొన్నారు.

    భవిష్యత్తులో తిరుమలలో పర్యావరణాన్ని కాపాడటం కోసం ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటు జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు వైకుంఠ ద్వారాన్ని తెరుస్తామని పేర్కొన్నారు. పర్యావరణ సంరక్షణ కోసం గ్రీన్ పవర్ ను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామని.. 11 కిలోల బంగారం వినియోగించి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సూర్యప్రభ వాహనం చేయించనున్నామని చెప్పారు.

    తిరుమలలో కాటేజీల ఆధుకరణ చేయనున్నామని.. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాలలో పునరుద్ధరించనున్నామని వెల్లడించారు. గరుడవారధి పనులను కొనసాగించనున్నామని అందుకు సంబంధించి నిధులు విడుదల చేశామని అన్నారు.