spot_img
Homeఎంటర్టైన్మెంట్కేసీఆర్ తో చిరు.. నాగ్ భేటీ.. 2వేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీకి గ్రీన్ సిగ్నల్?

కేసీఆర్ తో చిరు.. నాగ్ భేటీ.. 2వేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీకి గ్రీన్ సిగ్నల్?

Nagarjuna KCR Chiranjeevi

కరోనా ఎఫెక్ట్ సినిమా రంగం కుదేలైపోయింది. థియేటర్లు మూతపడగా.. షూటింగులు నిలిచిపోవడంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఇటీవలే ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగులకు.. థియేటర్లకు అనుమతి ఇచ్చాయి. అయితే ఇప్పట్లో ఈ రంగం కోలుకునేలా కన్పించడం లేదనే టాక్ విన్పిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

టాలీవుడ్లో షూటింగుల పర్మిషన్ కోసం టాలీవుడ్ పెద్దలు అప్పట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలైన కేసీఆర్.. జగన్మోహన్ రెడ్డిలను కలిశారు. అప్పట్లోనే సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చ జరిగినట్లు తెల్సింది. తాజాగా సీఎం కేసీఆర్ ను మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జున ప్రగతిభవన్లో కలుసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా  మారింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమపై అభివృద్ధిపై వారంతా చర్చించినట్లు తెలుస్తోంది.

Also Read: ఓటీటీలో విడుదలైన థ్రిల్లర్స్ లో ఇదే బెస్ట్ చిత్రం

తెలంగాణలో దాదాపు 10లక్షల మంది చిత్ర పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు. వీరిని ఆదుకునేలా.. థియేటర్లు పునః ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటిలోనే హైదరాబాద్ శివారులో దాదాపు 2వేల ఎకరాల్లో భారీ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి కేసీఆర్ తో చిరు.. నాగ్ చర్చించినట్లు సినీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.గతంలోనే సీఎం కేసీఆర్ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. అయితే నేటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా కేసీఆర్ తో చిరంజీవి.. నాగార్జున భేటి కావడంతో మరోసారి భారీ ఫిల్మ్ సిటీ తెరపైకి వచ్చింది. ఈమేరకు ప్రభుత్వం 1500 నుంచి 2వేల ఎకరాల స్థలాన్ని సేకరిస్తుందని తెలుస్తోంది.

Also Read: పాపం.. ‘భారతీయుడు 2’కి మరో సమస్య !

 ప్రస్తుత సాంకేతిక నైపుణ్యంతో భవిష్యత్ అవసరాల తగ్గట్టుగా ఇంటర్నేషనల్ స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ తో చిరు.. నాగ్ బేటికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈసారైనా ఫిల్మ్ సిటీ నిర్మాణం పట్టాలెక్కుతుందా? లేక ప్రతిపాదనలకే పరిమితం అవుతుందో వేచిచూడాల్సిందే..!
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Divi Vadthya

Divi Vadthya: నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటి అంటూ బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్..

Divi Vadthya: ఈమధ్య కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో కొంతమంది యంగ్ హీరోయిన్లు అందాల ఆరబోతలతో యూత్ ని పిచ్చెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు అయితే సబ్ స్క్రిప్షన్...
Naga Chaitanya

Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. నిన్న గాక మొన్ననే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తోంది కదూ , కాలం ఎంత వేగంగా...
Hardik Pandya

Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: మనం ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్లినా సరే దానికి కారణమైన మూలాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పైగా దానిని ఏమాత్రం విస్మరించకూడదు. కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను విస్మరిస్తే మొదటికే...
Team India

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...
Oktelugu Epaper