Tollywood: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి, మహేశ్ బాబు, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులంతా కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా సినీ ప్రముఖులకు జగన్ నుంచి ఘనంగా ఆహ్వానం అందింది. జగన్ అందర్నీ పేరు పేరున పలకరించారు. అనంతరం సమావేశం అయ్యారు.
Also Read: కృతి శెట్టి ‘కొత్త కొత్తగా’.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంది !
టికెట్ ధరలతో పాటు, సినీ పరిశ్రమ సమస్యలపై వీరు చర్చించారు. ఏ ఏ అంశాల పై చర్చించారు అంటే..
1. సినిమా టికెట్ల ధరల పెంపు పై చర్చించారు.
2. ఎంపిక చేసిన సినిమాలకు సబ్సిడీ పై చర్చించారు.
3. జీఎస్టీ మినహాయింపు పై చర్చించారు.
4. ఆన్‌లైన్ టికెట్ అమలు ఫిల్మ్ ఛాంబర్‌కు అప్పగించడం పై చర్చించారు.
5. పార్కులు, ప్రభుత్వ, చారిత్రక ప్రాంతాల్లో షూటింగ్ లకు అద్దె మినహాయింపు పై చర్చించారు.
6. చిన్న, మధ్య సినిమాలకు కూడా ఐదో షోకు అనుమతి పై చర్చించారు.
7. టాలీవుడ్‌కు పరిశ్రమ హోదా, ఏటా నంది అవార్డులు పై చర్చించారు.
8. జీవో నం.35లో సవరణల ప్రతిపాదనలపై చర్చించారు.
కాగా జగన్ అన్నిటికి సానుకూలంగా నిర్ణయ తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ కింద అంశాల పై కూడా ఇంకా చర్చించనున్నారని తెలుస్తోంది.
ఏసీ, నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ ధరల పెంపుపై చర్చించనున్నారు.
మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆహార పదార్థాలు ధరలపైనా చర్చించనున్నారు
ఏపీలో సినిమా స్టూడియోల ఏర్పాటుపైనా చర్చించనున్నారు
థియేటర్లలో విద్యుత్ ఫిక్స్‌డ్ ఛార్జీల వ్యవహారంపై చర్చించనున్నారు
నివేదిక రూపొందించిన ప్రభుత్వం నియమించిన కమిటీ పై చర్చించనున్నారు.
Also Read:మహేష్ కి ఆమె పై అంత ప్రేమ ఉందా ?