https://oktelugu.com/

ఫాదర్స్ డే.. చిరు భావోద్వేగ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాక నిత్యం అభిమానులతో టచ్లో ఉంటున్నారు. నేడు నేడు ఫాదర్స్ డేను పురస్కరించుకొని మెగాస్టార్ తన తండ్రి, కొడుకుతో కూడిన ఫొటోను అభిమానులకు షేర్ చేశారు. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ట్వీటర్లో ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రెటీలు తండ్రితో తమకున్న తీపి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన తండ్రితో ఉన్న […]

Written By:
  • admin
  • , Updated On : June 21, 2020 / 04:46 PM IST
    Follow us on

    మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాక నిత్యం అభిమానులతో టచ్లో ఉంటున్నారు. నేడు నేడు ఫాదర్స్ డేను పురస్కరించుకొని మెగాస్టార్ తన తండ్రి, కొడుకుతో కూడిన ఫొటోను అభిమానులకు షేర్ చేశారు. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ట్వీటర్లో ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

    ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రెటీలు తండ్రితో తమకున్న తీపి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి తండ్రి వెంకట్రావుకు సంబంధించిన ఓ పిక్ ను ట్వీటర్లో షేర్ చేశాడు. తన మనవడు రామ్‌చ‌ర‌ణ్ ను తన తండ్రి వెంక‌ట్రావు ఎత్తుకున్న ఫొటోను చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘మై చార్మింగ్ డాడ్‌తో చిరుత’ అంటూ ట్వీట్ చేశాడు. ‘మా నాన్న నవ్వు …నా బిడ్డ చిరునవ్వు.. రెండు నాకు చాలా ఇష్టం’ అంటూ ట్యాగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ చిరంజీవికి హ్యాపీ ఫాదర్స్ డే కామెంట్స్ పెడుతూ విషెస్ తెలుపుతున్నారు.

    ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీకి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఆయన సినిమాలన్నీంటికి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఖైదీ-150’, ‘సైరా’ల మూవీలను చిరంజీవితో నిర్మించాడు. తాజాగా ‘ఆచార్య’ను రాంచరణ్ నిర్మించడంతోపాటు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిరుకు జోడీగా కాజల్ ఆగర్వాల్ నటిస్తుంది. ఆచార్య సినిమాకు మణిశర్మ అదిరిపోయే సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.