Homeఎంటర్టైన్మెంట్జగన్ స్పూర్తితో ఆ స్టార్ హీరో సీఎం కావాలట. 

జగన్ స్పూర్తితో ఆ స్టార్ హీరో సీఎం కావాలట. 

Y S Jagan Mohan reddy, Tamil stars, Tamil Hero vijay, Dalapathi Vijay news, Kumbakonam, Vijay fans, Tamil Nadu news,
తమిళ తంబీలకు ఒక పట్టాన ఎవరూ నచ్చరు..నచ్చితే వదిలిపెట్టరు. ప్రాంతీయవాదం, భాషాభిమానం వేళ్లూనుకున్న తమిళ గడ్డపై ఇతర రాష్ట్రాలకు చెందిన నటుడైన, నాయకుడైనా రాణించడం..వారి మనసు గెలుచుకోవడం చాలా కష్టం. ఐతే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. తమిళ యువతలో ఆయనకు ఓ క్రేజ్ ఏర్పడింది. అనేక ప్రజాభిప్రాయ వేదికలపై మరియు సోషల్ మాధ్యమాలలో వారు జగన్ పట్ల అభిమానం చూపారు. జగన్ ఆధునిక రాజకీయాలలో మంచి పరిపాలనా దక్షుడని వారు అభినందించడం విశేషం.
తరచుగా తమిళనాట సినీ మరియు రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలపై జగన్ ఫోటో దర్శనం ఇవ్వడం చెప్పుకోదగ్గ అంశం.తాజాగా ఈ సంఘటన పునరావృతం అయ్యింది. జూన్ 22 దళపతి విజయ్ పుట్టినరోజు. ఈ సంధర్భంగా తమిళనాడులో కొందరు అభిమానులు విజయ్ కి బర్త్ డే విషెష్ చెవుతూ ఫ్లెక్సీ ఏర్పటు చేశారు. ఆ ఫ్లెక్సీ లో విజయ్ ఫొటోతో పాటు సీఎం జగన్ ఫోటో కూడా ఉంది. ఆ బ్యానర్ లో విజయ్ రాజకీయ అరంగేట్రం చేసి  రాజకీయాలలో కీలక శక్తిగా ఎదగాలన్నట్టు, వాళ్ళు కొటేషన్స్ రాయడం జరిగింది.
ఒంటరిగా పదేళ్లు పోరాడి సీఎం పదవి దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తిగా విజయ్ రాజకీయాలలో ఎదగాలని…సీఎం కావాలని కోరుకుంటున్నారు. సంకల్పంతో ముందుకు వెళితే సాధ్యం కానిది ఏమిలేదని, దానిని జగన్ నిదర్శనం అని తమ హీరోకి గుర్తు చేస్తున్నారు. కొంత కాలంగా విజయ్ కి రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయి. స్థానిక ప్రభుత్వాలతో పాటు, కేంద్రంలో ఉన్న బీజేపీతో ఆయనకు పట్టింపులు వచ్చాయి. బీజేపీ తీసుకు వచ్చిన ఎన్ఆర్సి మరియు సిఏఏ చట్టాలకు వ్యతిరేకమని ఆయన పరోక్షంగా చెప్పారు. ఆయన చేసిన సర్కార్, మెర్సల్ సినిమాలలో కేంద్రరాష్ట్ర  ప్రభుత్వాల నిర్ణయాలను ఉద్దేశిస్తూ ఘాటు విమర్శలు ఉన్నాయి.
ఈనేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు ఆమధ్య మాస్టర్ మూవీ షూటింగ్ ని అడ్డుకోవడం జరిగింది. అలాగే విజయ్ పై ఐటీ దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో తమ హీరో రాజకీయంగా ఎదిగిచక్రం తిప్పాలని..ఆయనను ఇబ్బంది పెడుతున్న వారికి చెక్ పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే విజయ్ తండ్రి గారైన ఎస్ ఏ చంద్రశేఖర్ పై ఒత్తిడి తెస్తున్నారు. విజయ్ రాజకీయాలలోకి ప్రవేశించేలా ప్రేరేపించాలని కోరుతున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో విజయ్ రాజకీయాల వైపు అడుగువేయకపోవచ్చు.
admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version