https://oktelugu.com/

చిరంజీవి, అల్లు అర్జున్ లను నక్సలైట్లుగా మారుస్తున్న కొరటాల?

దర్శకుడు కోరటాల శివకు టాలీవుడ్లో కమర్షియల్ డైరెక్టర్ మంచి గుర్తింపు ఉంది. సామాజిక అంశాలను తన సినిమా కథలో మేళవిస్తూ కమర్షియల్ హంగులు అద్దడంలో కొరటాల శివది అందేవేసిన చేయి. మంచి కథను ఎంచుకొని సినిమాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్లో అపజయం ఎరుగకుండా కొరటాల దూసుకెళుతున్నాడు. Also Read: తమన్నా కెరీర్ లోనే ఇది భారీ రెమ్యున‌రేష‌న్‌ ! కొరటాల శివ దర్శకుడిగా కంటే ముందు రచయితగా పని చేశాడు. ఆ అనుభవం కొరటాల శివకు ఎంతగానో ఉపయోగపడుతోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 / 01:48 PM IST
    Follow us on

    దర్శకుడు కోరటాల శివకు టాలీవుడ్లో కమర్షియల్ డైరెక్టర్ మంచి గుర్తింపు ఉంది. సామాజిక అంశాలను తన సినిమా కథలో మేళవిస్తూ కమర్షియల్ హంగులు అద్దడంలో కొరటాల శివది అందేవేసిన చేయి. మంచి కథను ఎంచుకొని సినిమాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్లో అపజయం ఎరుగకుండా కొరటాల దూసుకెళుతున్నాడు.

    Also Read: తమన్నా కెరీర్ లోనే ఇది భారీ రెమ్యున‌రేష‌న్‌ !

    కొరటాల శివ దర్శకుడిగా కంటే ముందు రచయితగా పని చేశాడు. ఆ అనుభవం కొరటాల శివకు ఎంతగానో ఉపయోగపడుతోంది. కొరటాల దగ్గర పది కథలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదు కథలను సినిమాలుగా మలిచి భారీ విజయాలను సాధించాడు. ఆయన వద్ద ఇంకో ఐదు కథలు ఉన్నట్లు తెలుస్తోంది.

    కొరటాల తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. నక్సలైట్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే మూవీలో కొంతమేరకు కథ నక్సల్ బరీ ఉద్యమ నేపథ్యంతో సాగుతుందని సమాచారం.

    Also Read: థియేటర్ల ఓపెనింగ్.. కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందా?

    కొరటాల వద్ద నక్సలైట్ కథ కూడా ఒకటి ఉందనే టాక్ విన్పిస్తోంది. ‘ఆచార్య’ మూవీ తర్వాత కొరటాల శివ అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడు. కేవలం నక్సలిజం మీదనే ఈ సినిమా ఉండనుందట. అల్లు అర్జున్ తో ఈ మూవీని తెరకెక్కిస్తాడనే టాక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఇదే నిజమైతే మామ అల్లుళ్లను నక్సలైట్లుగా మార్చిన ఘనత కొరటాల శివకే దక్కుతుందని కామెంట్స్ విన్పిస్తున్నాయి.