Homeఎంటర్టైన్మెంట్Chiru and Anil Ravipudi : చిరు-అనిల్ రావిపూడి మూవీ.. అదంతా ఫేక్ ప్రచారమా?

Chiru and Anil Ravipudi : చిరు-అనిల్ రావిపూడి మూవీ.. అదంతా ఫేక్ ప్రచారమా?

Chiru and Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి కుర్ర దర్శకులతో చిత్రాలు చేస్తున్నారు. ఈ తరం టాలెంటెడ్ దర్శకులతో పని చేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. చిరంజీవి కమిట్ అయిన చిత్రాలన్నీ యువ దర్శకులతోనే కావడం విశేషం. బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడితో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామా చిత్రీకరణ చివరి దశలో ఉందని సమాచారం. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం చిరంజీవి-త్రిష కాంబోలో మూవీ వస్తుంది.

ఇటీవల అనిల్ రావిపూడితో చిరంజీవి మూవీ స్టార్ట్ చేశాడు. 2026 సంక్రాంతి టార్గెట్ గా అనిల్ రావిపూడి చకచకా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఆరు నెలల్లో మూవీ పూర్తి చేసి విడుదల చేయడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. స్టార్స్ చిత్రాలు కూడా నెలల వ్యవధిలో కంప్లీట్ చేస్తాడు. అలాగే గ్యాప్ లేకుండా చిత్రాలు చేస్తాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ విడుదలై మూడు నెలలు గడవక ముందే చిరంజీవి ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు. ఇక అనిల్ రావిపూడి మార్క్ తో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుందట.

Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!

చిరంజీవి అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న హీరో. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి మూవీ అనగానే ఫ్యాన్స్ ఆత్రుత ఆసక్తి మొదలయ్యాయి. కాగా ఈ మూవీలో విలన్ గా యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఆర్ ఎక్స్ 100 మూవీతో ఫేమ్ తెచ్చుకున్న కార్తికేయ ఇటీవల బెదురులంక మూవీలో నటించాడు. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా కార్తికేయ గతంలో గ్యాంగ్ లీడర్(నాని), వలిమై చిత్రాల్లో విలన్ రోల్స్ చేశాడు.

విలన్ రోల్స్ కి కార్తికేయ పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి-చిరంజీవి చిత్రంగా విలన్ గా నటిస్తున్నాడని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తాజా సమాచారం. అదంతా ఫేక్ ప్రచారమే అంటున్నారు. అలాగే ఈ మూవీలో శ్రీకాంత్ ఓ కీలక రోల్ చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. గతంలో చిరంజీవి-శ్రీకాంత్ కాంబోలో శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలు వచ్చాయి. ఇక చిరంజీవి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తో ఓ చిత్రానికి సైన్ చేశారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే సూచనలు కలవు. చిరంజీవి కెరీర్లో మోస్ట్ వైలెంట్ మూవీగా ఇది రూపొందనుంది.

Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

RELATED ARTICLES

Most Popular