https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి ఎవర్ గ్రీన్ టాప్ 5 సినిమాలు ఇవే…

ముఖ్యంగా ఒక 5 సినిమాలైతే ఎంటైర్ అయిన కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ని సాధించడమే కాకుండా నటన పరంగా కూడా ఆయనకు మంచి పేరుని తీసుకొచ్చాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమాలు ఇవే...

Written By:
  • Gopi
  • , Updated On : March 4, 2024 / 03:38 PM IST

    Chiranjeevi Ever Green Top 5 Movies

    Follow us on

    Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా 40 సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో ఉంటూ తనకంటూ ఉన్న స్టార్ డమ్ ను పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న ఒకే ఒక్కడు మెగాస్టార్ చిరంజీవి… ఇక ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా కొన్ని సినిమాలు మాత్రం ఆయన కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా ఒక 5 సినిమాలైతే ఎంటైర్ అయిన కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ని సాధించడమే కాకుండా నటన పరంగా కూడా ఆయనకు మంచి పేరుని తీసుకొచ్చాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమాలు ఇవే…

    ఖైదీ
    చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవికి మొదటి ఇండస్ట్రీ హిట్ ను అందించింది. ఇక ఈ సినిమాతో సుప్రీం హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిగా అవతరించాడు…

    గ్యాంగ్ లీడర్…
    విజయ బాపినీడు డైరెక్షన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా కమర్షియల్ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పటికీ ఒక కమర్షియల్ సినిమా ఎలా ఉండాలి అనేదానికి ప్రతి ఒక్కరు ఎగ్జాంపుల్ గా గ్యాంగ్ లీడర్ సినిమాని చూపిస్తారు అంటే ఆ సినిమా ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు…

    జగదేకవీరుడు అతిలోకసుందరి…
    రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. ఇక శ్రీదేవి చిరంజీవిలా స్క్రీన్ ప్రజెంట్స్ అయితే అప్పటి ప్రేక్షకులను విపరీతంగా అలరించిందనే చెప్పాలి. ముఖ్యంగా ‘అబ్బని తీయని దెబ్బ ‘ అనే సాంగ్ మాత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగుల్లో ఒకటిగా నిలిచిపోయింది…

    ఇంద్ర
    మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టు కొట్టడమే కాకుండా చిరంజీవి ఒక ఫ్యాక్షన్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా రుచి చూపించింది…

    ఠాగూర్
    వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఠాగూర్ సినిమా భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా చిరంజీవి కెరియర్ లో ది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా అవినీతి మీద పోరాటం చేసే సినిమాగా వచ్చి సంచలనాలను సృష్టించింది…