Chiranjeevi’s Daughter Sreeja: ఇటీవల కాలం లో స్టార్ సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయ్యిపోయింది..నిన్న గాక మొన్న పెళ్ళైన జంటలు కూడా విడిపోవడం ఈమధ్యనే మనం ఎన్నో చూసాము..మేడ్ ఫార్ ఈచ్ అథర్ లాగ అనిపించే సమంత మరియు నాగ చైతన్యలు విడాకులు తీసుకోవడం ఎంత పెద్ద దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇక ఆ తర్వాత దాదాపుగా 18 ఏళ్ళు కాపురం చేసి ఇద్దరు పిల్లకు జన్మనిచ్చిన ధనుష్ – ఐశ్వర్య(రజినీకాంత్ కూతురు)..అలాగే పాతికేళ్ల నుండి సంసారం చేస్తున్న అమిర్ ఖాన్ – కిరణ్ రావు వంటి జంటలు కూడా విడాకులు తీసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది..పెళ్ళైన రెండు మూడేళ్ళ జంటలు విడిపోవడం లో ఒక్క అర్థం ఉంది..ఎందుకంటే వారి మధ్య సరిగా సఖ్యత కుదరకపొయ్యి ఉండొచ్చు అని అనుకోవచ్చు..కానీ 15 ఏళ్లకు పైగా కాపురం చేసి విడాకులు తీసుకోవడమే షాక్ కి గురి చేసే విషయం..ఎందుకంటే అంత సుదీర్ఘ దాంపత్య జీవితం లో ఇద్దరి మధ్య ఎన్నో సార్లు గొడవలు జరిగుంటాయి..మళ్ళీ సర్దుకుపొయ్యి ఎన్నోసార్లు కలిసిపోయాయి ఉంటారు..అలాంటి వారు కూడా విడిపోయాయి సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నట్టు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్ల పెదవి విరుస్తున్నారు..ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజా ఇప్పుడు మూడవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలు ఆమె పై తీవ్రమైన విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి.

శ్రీజ వైవాహిక జీవితం గురించి మన అందరికి తెలిసిందే..మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయం లో భరద్వాజ్ అనే అతనిని ప్రేమించింది..ఇంట్లో చెప్తే ఎక్కడ వారిద్దరి పెళ్ళికి అడ్డుపడుతారో అని బయపడి ఇంటి నుండి పారిపొయ్యి పెళ్లి చేసుకున్నారు..అప్పట్లో శ్రీజా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని మా నాన్న , బాబాయ్ లు మమల్ని చంపేసే ప్రమాదం ఉంది మాకు రక్షణ కలిపించాలంటూ అప్పట్లో శ్రీజ పోలీస్ స్టేషన్ లో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన ఘటన అప్పట్లో ఎలాంటి దుమారం రేపిందో మన అందరికి తెలుసు..అయితే భరద్వాజ్ తో కొన్ని సంవత్సరాలు కాపురం చేసి ఒక బిడ్డకి జన్మని కూడా ఇచ్చింది శ్రీజా..అయితే ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది..కూతురు భర్త తో విడిపోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గతం లో శ్రీజ చేసిన పనులన్నీ మర్చిపొయ్యి పెద్ద మనసుతో తిరిగి ఇంట్లోకి ఆహ్వానించి 2016 వ సంవత్సరం లో విశిష్ట అతిధుల మధ్య ఘనంగా కళ్యాణ్ దేవ్ అనే అతనితో వివాహం జరిపించారు..ఈ ఇద్దరి జంటకి కూడా ఒక్క బిడ్డ ఉంది.

Also Read: Amaravati: టీడీపీ నేతలు తగ్గితేనే ‘అమరావతి’ సజీవం.. లేకుంటే కష్టమే..
అంత సజావుగా సాగుతుంది అని అందరూ అనుకుంటున్న సమయం లో శ్రీజ కళ్యాణ్ దేవ్ తో కూడా విడాకులు తీసుకుంది అంటూ గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి..గత కొంతకాలం నుండి శ్రీజ మరియు కళ్యాణ్ దేవ్ కలిసి ఒక్క ఫామిలీ ఈవెంట్ లో కూడా కనిపించలేదు..ఒక్కప్పుడు ఇంస్టాగ్రామ్ లో తన భర్త కళ్యాణ్ దేవ్ తో కలిసి దిగిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉండే శ్రీజ కొంతకాలం నుండి కేవలం తన ఫోటోలను మాత్రమే షేర్ చేస్తుంది..అంతే కాకుండా తన ఇంస్టాగ్రామ్ పేరు కూడా శ్రీజ కళ్యాణ్ నుండి శ్రీజ కొణిదెల కి మార్చుకుంది..దీనితో వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారంటూ ప్రచారం సాగింది..ఈ ప్రచారం ని మెగా కుటుంబం కి చెందిన ఒక్కరు కూడా ఖండించలేదు..దీనితో వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారనే నిర్ధారణకు వచ్చారు అభిమానులు..అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే శ్రీజ అతి త్వరలోనే తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది..ఈ వార్త బయటకి వచ్చినప్పటి నుండి శ్రీజ పై సోషల్ మీడియా లో అభిమానుల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది..మరి దీనిపై మెగా ఫామిలీ స్పందిస్తుందో లేదో చూడాలి.

Also Read: Ashu Reddy: నగ్నంగా స్నానం చేస్తున్న పిక్స్ వదిలింది.. అషు రెడ్డి అందాల విందు