Homeఎంటర్టైన్మెంట్Nandamuri Balakrishna: బాలయ్య తో దిల్ రాజు..ఇలాంటి డైరెక్టర్ తో పనిచేస్తారని కలలో కూడా ఊహించి...

Nandamuri Balakrishna: బాలయ్య తో దిల్ రాజు..ఇలాంటి డైరెక్టర్ తో పనిచేస్తారని కలలో కూడా ఊహించి ఉండరు!

Nandamuri Balakrishna: ‘అఖండ’ చిత్రం నుండి నందమూరి బాలకృష్ణ స్క్రిప్ట్ ఎంపికలు ఏ రేంజ్ లో ఉంటున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యంగ్ డైరెక్టర్స్ తో తన వయస్సు కి తగ్గ పాత్రలు చేస్తూ హిట్టు మీద హిట్టు ని అందుకుంటున్నాడు. ‘అఖండ 2’ ఒక్కటే కమర్షియల్ గా ఫెయిల్యూర్ గా నిల్చింది. మిగిలిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య సినిమా అంటేనే భయపడి పారిపోయే రోజుల నుండి, బాలయ్య సినిమా అంటే మినిమం గ్యారంటీ […]

Nandamuri Balakrishna: ‘అఖండ’ చిత్రం నుండి నందమూరి బాలకృష్ణ స్క్రిప్ట్ ఎంపికలు ఏ రేంజ్ లో ఉంటున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యంగ్ డైరెక్టర్స్ తో తన వయస్సు కి తగ్గ పాత్రలు చేస్తూ హిట్టు మీద హిట్టు ని అందుకుంటున్నాడు. ‘అఖండ 2’ ఒక్కటే కమర్షియల్ గా ఫెయిల్యూర్ గా నిల్చింది. మిగిలిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య సినిమా అంటేనే భయపడి పారిపోయే రోజుల నుండి, బాలయ్య సినిమా అంటే మినిమం గ్యారంటీ అనేది బలంగా జనాల్లోకి వెళ్ళింది. ‘అఖండ 2’ తర్వాత గోపీచంద్ మలినేని తో బాలయ్య ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘వీర సింహా రెడ్డి’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత చెయ్యబోయే చిత్రం కూడా లాక్ అయ్యింది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో బాలయ్య ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. దిల్ రాజు నిర్మాణం లో ఇది బాలయ్య కి ఇది మొట్టమొదటి ఈ చిత్రం. ఈ సినిమాకు డైరెక్టర్ గా అబిషన్ జీవింత్ మన టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. గత ఏడాది ఆయన తమిళం లో తీసిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఓటీటీ లో కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అలాంటి డైరెక్టర్ తో బాలయ్య పని చెయ్యబోతున్నాడు. అంటే తన మార్క్ హీరోయిజం ని పూర్తిగా పక్కన పెట్టి, కేవలం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్నాడు అన్నమాట. బాలయ్య ద్రుష్టి కోణం లో చూస్తే ఇది చాలా పెద్ద ప్రయోగమే అని చెప్పాలి. ఎందుకంటే బాలయ్య ఆడియన్స్ వేరు. ఆయన సినిమా అంటే మాస్, యాక్షన్ , డ్యాన్స్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. అవేమి లేకుండా బాలయ్య సినిమా అంటే సాహసం అనే చెప్పాలి.

ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచందర్ ని సంప్రదిస్తున్నారట. ‘అఖండ’ నుండి ‘అఖండ 2’ వరకు వరుసగా 5 సినిమాలకు తమన్ నే సంగీతం అందించాడు, ఇప్పుడు ఆయన్ని పక్కన పెట్టే ఆలోచన లో ఉన్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper