Director Bobby: పవన్ విషయంలో సీరియస్ గా రియాక్ట్ అయిన చిరంజీవి.. దర్శకుడు బాబి కామెంట్స్..

మెగా ఫ్యామిలీ పై అభిమానంతో నిన్న జరిగిన బోళా శంకర్ ప్రీ రిలీజ్ కి అటెండ్ అయ్యారు ఈ దర్శకుడు. ఇక ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవికి పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమ గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Written By: Swathi, Updated On : August 7, 2023 6:56 pm

Director Bobby

Follow us on

Director Bobby: మెగా ఫ్యామిలీలో చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చిన వీరికి ఎవ్వరు సాటి కారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా వచ్చినా కానీ ఆయనకంటూ సొంత అభిమానులను ఎంతోమందిని సంపాదించుకున్నారు. ఇక ఈ ఇద్దరు మెగా హీరోలతోను సినిమాలు చేసిన అతి కొద్ది మంది దర్శకులలో బాబీ ఒకరు. ఈ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ తీయగా, చిరంజీవితో సూపర్ హిట్ సినిమా వాల్తేరు వీరయ్య తీశారు.

మెగా ఫ్యామిలీ పై అభిమానంతో నిన్న జరిగిన బోళా శంకర్ ప్రీ రిలీజ్ కి అటెండ్ అయ్యారు ఈ దర్శకుడు. ఇక ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవికి పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమ గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బాబీ మాట్లాడుతూ..’చిరంజీవి గారి గురించి నేను ఏం చెప్పగలను.. అన్నయ్యను దూరం నుంచి అభిమానించడం వేరు.. ఆయన్ని దగ్గరి నుంచి చూశాకా? అభిమాని అనే పెద్ద పదం ఏదైనా ఉందేమో అని వెతుకుతున్నాను.‌ వాల్తేరు వీరయ్య తరువాత నాకు చిరంజీవి గారి పైన మరింత గౌరవం పెరిగింది. ఆయనకు ఆవేశం, కోపంరాదు.. అంటారు.. కానీ ఓ సందర్భం చెబుతాను. ఆయన్ను అంటే ఆయన మన్నిస్తారేమో. ఆయన తమ్ముళ్లను అంటే కాదు. ఓ చిన్న ఉదాహరణ చెబుతాను..పవన్ కళ్యాణ్ గారిది ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది.. ఓ పెద్ద డాక్టర్ ఇంట్లో షూటింగ్ జరుగుతోంది.. లైట్ మెన్స్ షూలు వేసుకుని ఇంట్లో నడుస్తున్నారు.‌ఇడియట్స్ గెట్ అవుట్ అంటూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడు..అది విని లోపలకు వచ్చి ఏమైంది అని పవన్ కళ్యాణ్ అడిగారు.. షూలు వేసుకుని నడవొద్దు అని అన్నారు.. షూటింగ్ కోసమే కదా ఇచ్చారు.. డబ్బులు తీసుకున్నారు కదా? ఏం ప్రాబ్లం అని అన్నారు.. వాళ్లను షూలు వేసుకోనివ్వకపోతే.. నేను షూటింగ్ చేయను.. వెళ్లిపోతాను అని పవన్ కళ్యాణ్ అలిగి వెళ్లాడు.. వేరే నిర్మాతల ద్వారా ఆ విషయం చిరంజీవి గారికి తెలిసింది’ అని చెప్పుకొచ్చారు.

ఇక ఆ తరువాత చిరంజీవి ఏమి చేశారు అనే విషయం తెలుపుతూ..’వెంటనే ఆయన డాక్టర్‌కి ఫోన్ చేశారు.. ఎవడ్రా నువ్.. ఇంట్లోంచి వెళ్లమనడానికి.. నువ్వెంత నీ ఇళ్లు ఎంత.. సినిమా వాళ్లు కష్టపడతారని తెలిసే కదా నువ్ నీ ఇళ్లు ఇచ్చింది.. డబ్బులు తీసుకుంటున్నావ్ కదా? నీకు నిజంగానే నీ ఇంటి మీద అంత ప్రేమ ఉంటే.. తాళం వేసుకుని కూర్చో.. షూటింగ్‌లకు ఇవ్వొద్దు.. రెంట్లు వసూల్ చేయొద్దు.. నా తమ్ముడి అలిగి వెళ్లి గంట అయింది కాబట్టి ఊరుకున్నా.. వెంటనే తెలిస్తే వచ్చి షూటింగ్ జరిపించే వాడ్ని.. అని ఆవేశంగా వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి గారూ ఉన్నారు.. తమ్ముడిని అంటే ఆయన ఊరుకోరు.. మనలాంటి తమ్ముళ్లని అన్నా ఆయన ఊరుకోరు’ అంటూ ఆయన కోపం గురించి చెప్పుకొచ్చారు డైరెక్టర్ బాబీ.

ఇక భోళా శంకర్ సినిమా విజయానికి వస్తే ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలకు సిద్ధంగా ఉంది.