https://oktelugu.com/

Chiranjeevi: తన మంచి తనం వల్ల నమ్మిన వాళ్ల చేతిలోనే దారుణంగా మోసపోయిన చిరంజీవి…

యండమూరికి చిరంజీవికి మధ్య మొదటి నుంచి కూడా మంచి సన్నిహిత్యం ఉంది. ఆయన రాసిన నవలల్ని చిరంజీవి సినిమాలుగా తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 7, 2024 / 03:32 PM IST

    Chiranjeevi was cheated

    Follow us on

    Chiranjeevi: అతి మంచితనం ఎప్పుడు పనికిరాదు అని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలో మంచివాళ్లు కనిపించడమే అరుదు.అలాంటిది ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరు మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్లలో చిరంజీవి ఒకరు. ఈయన టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశాలని ఇస్తూ ఉంటాడు. అందులో కొందరు వాటిని సద్వినియోగం చేసుకుంటే, మరి కొందరు మాత్రం మిస్ యూజ్ చేసుకొని వాళ్లకి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడమే కాకుండా చిరంజీవికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి…

    అలాంటి వాళ్లలో ముందుగా యండమూరి వీరేంద్రనాథ్(Yandamuri Veerendranath) ఒకరు. యండమూరికి చిరంజీవికి మధ్య మొదటి నుంచి కూడా మంచి సన్నిహిత్యం ఉంది. ఆయన రాసిన నవలల్ని చిరంజీవి సినిమాలుగా తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆయనకి దర్శకుడిగా కూడా అవకాశం ఇచ్చి ఆయనను ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశ్యం తో చిరంజీవి హీరోగా చేసిన ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’ అనే సినిమాకి తనని దర్శకుడుగా తీసుకున్నాడు. కానీ యండమూరి కి దర్శకత్వ శాఖలో పెద్దగా పరిజ్ఞానం లేకపోవడంతో ఆయన సినిమా షూటింగ్ మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా చేయడం నావల్ల కాదు అంటూ చేతులెత్తేశాడు.

    అయినప్పటికీ చిరంజీవి ఆ సినిమాను అప్పటికే ఆపేయచ్చు. కానీ ఇప్పటి దాకా ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు మొత్తం నష్ట పోతాడు అని ఆలోచించిన చిరంజీవి ఎట్టి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ కి నష్టం రాకూడదనే ఉద్దేశ్యంతో ఆ సినిమా షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేయించి ప్లాప్ అవుతుందని తెలిసిన కూడా ఆ సినిమాని రిలీజ్ చేసి ప్రొడ్యూసర్ డబ్బులు ఆయనకు వచ్చేలా చేశాడు. ఇక దాని వల్ల చిరంజీవికి ఒక ఫ్లాప్ రావడమే కాకుండా, అలాంటి చెత్త సినిమా చేసినందుకు చిరంజీవికి విమర్శలు కూడా వచ్చాయి…

    ఇక రీసెంట్ గా చిరంజీవి ‘భోళా శంకర్ ‘ అనే సినిమాతో మరో భారీ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. 10 సంవత్సరాల కిందట షాడో అనే సినిమాతో భారీ డిజాస్టర్ ని తీసిన మెహర్ రమేష్ కి అప్పటినుంచి ఇప్పటివరకు ఎవరు అవకాశాలను ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆయన చేసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు డిజాస్టర్లే కావడం విశేషం… కానీ చిరంజీవి తనకి లైఫ్ ఇవ్వాలి అనే ఉద్దేశ్యం తో తమిళం లో సూపర్ డూపర్ హిట్ అయిన ‘వేదాలం ‘ సినిమాను తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమా చేయడం వల్ల చిరంజీవికి మరోసారి బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది… ఇలా తన మంచితనం వల్లే చిరంజీవి చాలావరకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటూ ఆయన శ్రేయోభిలాషులు చెబుతూ ఉంటారు…