https://oktelugu.com/

India Vs England 5th Test: వారెవ్వా గిల్.. కళ్ళు చెదిరిపోయే క్యాచ్

భారత్ టాస్ ఓడిపోవడంతో.. ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు 64 పరుగులు జోడించింది. క్రావ్ లే(36), డకెట్(27) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 7, 2024 / 03:28 PM IST

    India Vs England 5th Test

    Follow us on

    India Vs England 5th Test: ధర్మశాల వేదికగా ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో భారత ఆటగాడు గిల్ అదిరిపోయే క్యాచ్ పట్టాడు.. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఈ వీడియో లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది.

    భారత్ టాస్ ఓడిపోవడంతో.. ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు 64 పరుగులు జోడించింది. క్రావ్ లే(36), డకెట్(27) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ బుమ్రా, సిరాజ్ తో బౌలింగ్ వేయించినప్పటికీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు ధాటిగా ఆడుతున్నారు. అప్పటికే తొలి వికెట్ కు 64 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడిని విడగొట్టడానికి చివరి ప్రయత్నం గా రోహిత్ శర్మ కులదీప్ యాదవ్ ను రంగంలోకి దించాడు. కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కులదీప్ యాదవ్ నిలబెట్టుకున్నాడు.

    17.5 ఓవర్ వద్ద స్ట్రైక్ లో డకెట్ ఉన్నాడు.. కులదీప్ యాదవ్ బంతిని మెలికలు తిప్పుతూ బ్యాటర్ కాళ్ల ముందు వేశాడు. ఎడమచేతి వాటం బ్యాటరయిన డకెట్ ఆ బంతిని లాంగ్ ఆన్లోకి ఆడాడు.. బంతి గాల్లోకి లేవడంతో అక్కడే కాచుకొని ఉన్న గిల్ వెనక్కి పరిగెత్తుతూ బంతిని అమాంతం అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ తొలి వికెట్ భాగస్వామ్యానికి 64 పరుల వద్ద తెరపడింది.

    ఈ అరుదైన క్యాచ్ అందుకున్న గిల్ ను సహచర ఆటగాళ్లు అభినందించారు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..” గిల్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ ఇంగ్లాండ్ తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడేలా చేసింది. అద్భుతమైన క్యాచ్ అందుకున్న గిల్ అభినందనీయుడంటూ” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.