Chiranjeevi: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు నాజర్..ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి నేడు లెజండరీ నటులలో ఒక్కరిగా చేరాడు ఆయన..కామెడీ పాత్ర అయినా..ఎమోషనల్ పాత్ర అయినా..విలన్ క్యారెక్టర్ అయినా..ఏ పాత్రలోనైనా ఒదిగిపొయ్యి నటించడం నాజర్ కి వెన్నతో పెట్టిన విద్య..అందుకే దశాబ్దాల నుండి ఆయన డిమాండ్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది..సాధారణంగా ఇంటర్వూస్ తక్కువగా ఇచ్చే నాజర్ ఇటీవలే ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..సినిమాల్లోకి అడుగు పెట్టక ముందు..ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఆయనకీ చోటు చేసుకున్న కొన్ని మధురమైన జ్ఞాపకాలు..మెగాస్టార్ చిరంజీవి తో ఆయనకీ ఉన్న అనుబంధం గురించి ఆయన చెప్పిన కొన్ని మాటలు..ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తున్నాయి..విశేషం ఏమిటి అంటే చిరంజీవి మరియు నాజర్ గారు కలిసి ఇప్పటి వరుకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు..కానీ చిరంజీవి తో ఆయనకీ ఉన్న అనుబంధం సోదరసమానమైనది అని ఆయన మాటలు చూస్తే అర్థం అయ్యిపోతుంది.

చిరంజీవి మరియు నాజర్ ఒక్కే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు అట..ఆ సమయం వీళ్లిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు..అయితే చిరంజీవి మరియు ఆయన తోటి స్నేహితులు లంచ్ టైం లో కాంటీన్ లోనే భోజనం చేసేవారు అట..కానీ నాజర్ మాత్రం ఇంట్లో అమ్మ చేసే వంటలను క్యారేజీ లో తీసుకొచ్చి తినేవాడు అట..ఒక్క చిరంజీవి నాజర్ తో మాట్లాడుతూ ‘నువ్వు రోజు పొద్దున్నే అమ్మని కష్టపెట్టి వంట చెయ్యిస్తున్నావా..రేపటి నుండి ఇంట్లో నుండి క్యారేజీ తీసుకొస్తే చంపుతా నిన్ను..మాతో పాటు కాంటీన్ లో తిను’ అని అన్నాడు..అప్పటి నుండి నేను కాంటీన్ లోనే అందరితో కలిసి భోజనం చేసే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు నాజర్..ఒక్కే ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నప్పటికీ కూడా చిరంజీవి నాకంటే ముందుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పెద్ద స్టార్ హీరో అయ్యాడు అట..నాజర్ మాత్రం ఒక్క ఫైవ్ స్టార్ హోటల్ లో పని చేస్తూ ఉండేవాడు అట..ఒక్క రోజు చిరంజీవి సినిమా షూటింగ్ నాజర్ పని చేస్తున్న హోటల్ లో జరిగింది అట..అక్కడ పని చేస్తున్న నాజర్ ని చూసి చిరంజీవి షాక్ కి గురి ‘ఏంటి నాజర్ నువ్వు..ఇక్కడ పని చేస్తున్నావు ఏంటి..నీకు ఉన్న టాలెంట్ కి మహానటుడివి అవుతావు అనుకున్నా..కానీ ఇలా దర్శనమిస్తావు అని ఊహించలేదు..నువ్వు అర్జెంటు గా సాయంత్రం నన్ను కలవు’ అని అన్నాడట..కానీ నాజర్ ఆ తర్వాత కలవలేదు కానీ ..బాల చందర్ తెరకెక్కించే సినిమాలో అనుకోకుండా అవకాశం వచ్చింది అని..ఇంకా ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు అని నాజర్ చెప్పుకొచ్చారు.

Also Read: Woman Was Found Chopped: క్రైమ్ మిస్టరీ: ప్రేమించి పెళ్లాడి ఆమెను అతడు ఎందుకు చంపాడు..
[…] […]