https://oktelugu.com/

Chiranjeevi- Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ కష్టాలు విని కదిలివచ్చిన చిరంజీవి.. ఏం చేశాడంటే?

చిరంజీవి, సుధాకర్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకునేటప్పుడు ఇద్దరు ఒకే రూంలో ఉండేవారు. దీంతో వారి మధ్య మంచి స్నేహం ఉండేది. ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చినా చిరంజీవికి మంచి అవకాశాలు

Written By: , Updated On : June 20, 2023 / 06:17 PM IST
Chiranjeevi- Comedian Sudhakar

Chiranjeevi- Comedian Sudhakar

Follow us on

Chiranjeevi- Comedian Sudhakar: అప్పట్లో కమెడియన్ గా చేసిన సుధాకర్ ఆరోగ్యం బాగా లేదు. అందుకే ఆయనను గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అప్పట్లో కమెడియన్ గా చేసే సమయంలో అందగాడిగా ఉన్న అతడు ప్రస్తుతం గుర్తు పట్టలేనంతగా మారాడు. ఓ టీవీ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అతడిని ఎవరు గుర్తుపట్టలేదు. తన గురించి మొత్తం చెప్పాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే ఇలా మారానన్నాడు.

చిరంజీవి, సుధాకర్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకునేటప్పుడు ఇద్దరు ఒకే రూంలో ఉండేవారు. దీంతో వారి మధ్య మంచి స్నేహం ఉండేది. ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చినా చిరంజీవికి మంచి అవకాశాలు రావడంతో హీరోగా నిలదొక్కుకున్నాడు. సుధాకర్ కు కూడా హీరో వేషాలు వచ్చినా సినిమాలు హిట్ కాలేదు. దీంతో కమెడియన్ గానే స్థిరపడిపోయాడు.

అందరితో కలిసి 2005 వరకు నటించాడు. ఆ తరువాత తెలుగు తెరకు దూరమయ్యాడు. అనారోగ్య కారణాలతో సినిమాలు చేయలేదు. కానీ ఇటీవల ఓ టీవీ షోకు ముఖ్య అతిథిగా హాజరైన సుధాకర్ ను ఎవరు గుర్తుపట్టలేదు. అంతలా మారిపోయాడు. తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో ఏవేవో రాస్తున్నారని, తాను మాత్రం బతికే ఉన్నానని చెప్పాడు.

తన కొడుకు కెరీర్ ను చిరంజీవి నిలబెడతారని అన్నాడు. చిరంజీవి ఆధ్వర్యంలోనే సినిమాల్లోకి తన కొడుకు ఎంట్రీ ఉంటుందని సూచించాడు. ఆ బాధ్యత తన స్నేహితుడు చిరంజీవి తీసుకున్నాడని తెలిపాడు. గతంలో కళాశాల సీటు విషయంలో కూడా చిరంజీవి చొరవ తీసుకుని మాట్లాడారని పేర్కొన్నాడు. ఇప్పుడు తన కొడుకును కూడా చిరంజీవి సినిమాల్లోకి రంగ ప్రవేశం చేయిస్తారని చెబుతున్నాడు. చిరంజీవి స్నేహం కోసం ప్రాణం ఇచ్చే మనిషి అని అందరికి తెలుసు.