Chiranjeevi Speech At Kubera Success Meet: తమిళ్ సినిమా ఇండస్ట్రీ తో పోటీపడి తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లిన వారిలో శ్రీ ‘ నందమూరి తారక రామారావు’ (NTR) గారు మొదటి స్థానంలో ఉంటారు. ఇక ఆయన తర్వాత నాగేశ్వరరావు,కృష్ణ, శోభన్ బాబు చిరంజీవి లాంటి నటులు సైతం తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం అయితే చేశారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా గుర్తింపు అయితే ఉండకపోయేది. తమిళ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు సినిమాలను ఎప్పుడు తొక్కేయాలనే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ మన హీరోలు మంచి సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక స్పెషల్ స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎలివేట్ అయింది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మన ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్లో ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడున్న దర్శక నిర్మాతలు మంచి సబ్జెక్టులను సినిమాలుగా చేస్తూ గొప్ప సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట మనవళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో మన స్టార్ హీరోలందరు చాలా కాన్ఫిడెంట్ గా భారీ సక్సెస్ లను సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన డాన్సులతో, ఫైట్లతో ప్రేక్షకులను మైమరిపింప చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)… ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…గతంలో ఆయన చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ (Saira Narasimha Reddy) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయినప్పటికి ఇక రాబోయే సినిమాలతో మరోసారి పాన్ ఇండియా బాట పట్టడమే కాకుండా సూపర్ సక్సెస్ లను సాధించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన విశ్వంభర (Vishwambhara) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూట్ అయిపోయినప్పటికి గ్రాఫిక్స్ పనుల్లో కొంచెం లేట్ అవుతూ ఉండడం వల్ల ఈ సినిమా రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మొత్తానికైతే ఈ సినిమాని ఈ ఇయర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అలాగే 2026 సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఈ రెండు సినిమాలతో చిరంజీవి (Chiranjeevi) తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…
ఇక రీసెంట్ గా చిరంజీవి కుబేర (Kubera) సినిమా సక్సెస్ మీట్ కి హాజరయ్యాడు. అందులో చిరంజీవి మాట్లాడుతూ ఉంటే ఆయన మాటల్లో ఏదో తడబాటు అయితే కనిపిస్తోంది. ఇక ఆయనకి బాగా ఏజ్ అయిపోయిన వ్యక్తులా కనిపిస్తున్నాడు. సినిమాలు చేసే ఓపిక కూడా తనలో లేదా అన్నట్టుగా ఆయన మాట తీరు చూస్తే కనిపిస్తోంది.
ఇదంతా చూసిన చిరంజీవి అభిమానులు కొంతవరకు బాధపడుతుంటే మరి కొంతమంది సినిమా మేధావులు మాత్రం చిరంజీవి ఇక సినిమాలు చేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే బెటర్ అని కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి ఇక మీదట సినిమా హీరోగా చేస్తాడా? లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది…