Chiranjeevi Balakrishna : తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ చాలామంది ప్రేక్షకులను ప్రభావితం చేయగలిగే సినిమాలను చేస్తున్నారు. అందుకే వాళ్ళ నుంచి ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా వస్తే చాలు ప్రేక్షకులందరిలో దానికి సంబంధించిన ఒక రెవల్యూషన్ అనేది క్రియేట్ అవుతోంది. మొత్తానికైతే స్టార్ హీరోలందరు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక సీనియర్ హీరోలైనా బాలయ్య బాబు మాత్రం తన క్యారెక్టర్ కి తగ్గ పాత్రలను ఎంచుకుంటూ తనదైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేసిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో 50 సంవత్సరాల మనిషిగా కనిపించిన బాలయ్య బాబు ఆ సినిమాలో తన పాత్ర తో వెలివేట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ‘అఖండ 2’ సినిమాలో సైతం 50 సంవత్సరాల క్యారెక్టర్ లో నటించి మరోసారి విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు…
తన తోటి హీరో అయిన చిరంజీవి మాత్రం ఇప్పటికి హీరోయిన్లతో స్టెప్పులు వేస్తూ డ్యూయేట్లు పాడుతూ యంగ్ బాయ్ లో కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకని చిరంజీవి అలాంటి పాత్రలు చేస్తున్నారు. 70 సంవత్సరాల వయసులో కూడా తన ఏజ్ కు తగ్గ పాత్రలను చేయకుండా ఇంకా యాంగ్ బాయ్ లో సినిమాలు చేయడం ఎందుకు అనే వారు కూడా ఉన్నారు.
ఈ విషయంలో చిరంజీవి బాలయ్య బాబుని చూసి నేర్చుకుంటే మంచిదని పలువురు సినిమా మేధావులు సైతం అతనికి సలహాలైతే ఇస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ చేయలేదు. కానీ బాలయ్య మాత్రం వరుసగా నాలుగైదు విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు…
బాలయ్య బాబు చేసే సినిమాలతో చిరంజీవి సైతం తనను తాను పోల్చుకొని ఇప్పటికైనా తన ఏజ్ తగ్గ సినిమా చేస్తే బాగుంటుందని పలువురు విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు…. ఇక ఇప్పటికైనా చిరంజీవి డ్యాన్స్ లు ఫైట్లు కాకుండా కొత్త కథలతో సినిమాలు చేయాలని కోరుకుందాం…