https://oktelugu.com/

Tollywood: ఇండస్ట్రి పెద్దగా ఉండనంటున్న మెగాస్టార్ చిరంజీవి… ఇంకా ఏం అన్నారంటే ?

Tollywood: తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా ఇండస్ట్రీలో పెద్ద ఎవరు అనే విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. కొందరు చిరంజీవి పేరు చెబుతుంటే… మరి కొందరు మాత్రం మోహన్ బాబు పేరు చెప్తున్నారు. ఈ విషయంలో ఎప్పుడూ మెగాస్టార్ ముందుకొచ్చి మాట్లాడింది లేదు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేరుగా చిరంజీవి నోటి నుంచి ఇండస్ట్రీ పెద్ద అనే మాట బయటికి వచ్చింది. తాజాగా సినీ కార్మికులకు హెల్త్‌ కార్డుల పంపిణీ కోసం నిర్వహించిన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 2, 2022 1:56 pm
    Follow us on

    Tollywood: తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా ఇండస్ట్రీలో పెద్ద ఎవరు అనే విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. కొందరు చిరంజీవి పేరు చెబుతుంటే… మరి కొందరు మాత్రం మోహన్ బాబు పేరు చెప్తున్నారు. ఈ విషయంలో ఎప్పుడూ మెగాస్టార్ ముందుకొచ్చి మాట్లాడింది లేదు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేరుగా చిరంజీవి నోటి నుంచి ఇండస్ట్రీ పెద్ద అనే మాట బయటికి వచ్చింది. తాజాగా సినీ కార్మికులకు హెల్త్‌ కార్డుల పంపిణీ కోసం నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

    chiranjeevi shocking comments about telugu film industry

    అయితే దాసరి నారాయణ రావు తరువాత సిని ఇండస్ట్రీలో పెద్దగా ఎవరూ లేరని.. మీరు ఆ బాధ్యత తీసుకుంటే భరోసాగా ఉంటుందని అక్కడ ఉన్నవారు కోరగా.. చిరంజీవి స్పందించారు. చిరంజీవి మాట్లాడుతూ… పెద్దరికం, హోదా అనేవి తను ససేమిరా ఇష్టం లేదని, నేను పెద్దగా ఉండను, ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవడం తను పెద్ద ఇబ్బంది అని అన్నారు. బాధ్యత కలిగిన ఓ బిడ్డగా ఉంటానిని అన్నారు. అవసరం వచ్చినప్పుడూ..నేను ఉన్నానంటూ ముందుకు వస్తానని స్పష్టం చేశారు. అనవసరమైన వాటికి ప్రతీదానికి తగుదునమ్మ అంటూ ముందుకొచ్చే ప్రసక్తే లేదని అన్నారు. అవసరం వచ్చినప్పుడు సంక్షోభంలో తాను తప్పకుండా ఉంటానన్నారు.

    ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే.. అటువంటి గొడవలను తీర్చనని అన్నారు. రెండు యూనియన్ల మధ్యనో, ఇద్దరు వ్యక్తుల మధ్యనో పంచాయతీ చేయాలంటే చేయను అని స్పష్టం చేశారు. ప్రస్తుతం చిరు చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమరాన్ని రేపుతున్నాయి. టాలీవుడ్ లోని అన్ని విభాగాల సభ్యుల కుటుంబాలకు యోధా డయాగ్నిస్టిక్స్‌ ల్యాబుల్లో టెస్టులు, చికిత్సకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. తన కోరిక మేరకు వెంటనే అంగీకరించిన యోధా డయాగ్నస్టిక్‌ యాజమాన్యానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. 50% రాయితీతో సినీ కార్మికులకు హెల్త్ కార్డులను అందించడం ఆనందంగా ఉందన్నారు చిరంజీవి.