Chiranjeevi-Mohan Babu: ‘సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండటం ఇష్టం లేదు’ అంటూ తాజాగా చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పెద్ద అనే హోదా తనకిష్టం లేదని మెగాస్టార్ చాలా క్లారిటీగా స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ రోజు ఉదయం సినీ కార్మికులకు హెల్త్ కార్డుల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సినీ కార్మికుల తరుపున ఓ వ్యక్తి పైకి లేచి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరూ లేరు. ఆ బాధ్యత చిరంజీవి గారు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం” అంటూ చిరంజీవి వైపు చూశారు.
ఆ మాటకు మెగాస్టార్ సీరియస్ అవుతూ –
వెంటనే స్పందించిన చిరంజీవి.. ‘ఈ పెద్దరికం, ఈ హోదాలు నాకు ఇష్టం లేదు. నేను మాత్రం పెద్దగా అస్సలు వ్యవహరించను. ఆ పదవి నాకస్సలు వద్దే వద్దు. అయితే, బాధ్యత గల ఒక బిడ్డగా మాత్రం మీకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను. అందరి బాధ్యతా తీసుకుంటాను. అందరికీ అందుబాటులో ఉంటాను. అలాగే అవసరం వచ్చినప్పుడు తప్పకుండా సాయం చేయడానికి ముందుకు వస్తాను’ అంటూ చిరు ఎమోషనల్ గా చెప్పారు.
ఐతే, చిరంజీవి పరోక్షంగా మోహన్ బాబును ఉద్దేశించి మాట్లాడుతూ –
“నేను అనవసరమైన వాటిని పట్టించుకోను. ముఖ్యంగా కొన్ని గొడవల విషయంలో మాత్రం నేను ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ముఖ్యంగా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, రెండు యూనియన్ల మధ్య వివాదం జరిగితే.. ఆ వివాదాలను, ఆ గొడవలను తీరుస్తూ నేను కూర్చోలేను. ఒకవేళ ఎవరైనా అలాంటి వాటిని నా వద్దకు తీసుకువస్తే ఎట్టిపరిస్థితుల్లో నేను పంచాయతీ చేయను’ అంటూ చిరు పరోక్ష విమర్శలు చేశారు.
చిరంజీవి చేసిన ఈ పరోక్ష విమర్శలు వెనుక అసలు కారణం ఇదే !
తెలుగు సినిమా పరిశ్రమకు ‘దాసరి’ తర్వాత పెద్ద దిక్కు లేదు అని చిరంజీవి తెరపైకి వచ్చారు. పెద్దగా చేయాల్సిన మంచి చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మోహన్ బాబు లాంటి వ్యక్తుల అహం దెబ్బ తింది. ‘ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్దలు ఎవ్వరూ లేరు’ అంటూ మోహన్ బాబు మీడియా ఎదుటే కామెంట్స్ చేశాడు.
దీనికి తోడు సినిమా ఇండస్ట్రీకి ఏపీలో ఎదురవుతున్న సమస్యలకు కారణం.. ‘మెగాస్టార్ చిరంజీవి’ వైఫల్యమే అంటూ కొందరు నిర్మాతల మధ్య కూడా ఆ మధ్య ఒక చర్చ జరిగిందట. అప్పుడు చిరంజీవి గురించి ఓ నిర్మాత కాస్త టంగ్ స్లిప్ అయ్యాడని టాక్.
చిరు సరైన సమయంలో జగన్ పై ఒత్తిడి పెంచలేకపోయాడని, అది చిరంజీవి చేతగాని తనమే అని, జగన్ ను మొదటి నుంచీ చిరంజీవి డిమాండ్ చేయలేక, రిక్వెస్ట్ చేస్తున్నారని, అదే మనకు నష్టం చేసిందని కూడా ఆ నిర్మాత కామెంట్స్ చేశాడట.
మొత్తానికి మోహన్ బాబు కామెంట్స్ తో సహా ఆ నిర్మాతల మాటలన్నీ చిరు చెంతకు చేరాయి. అందుకే సినిమా ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఇక ఎప్పుడూ చొరవ చూపకూడదు అని చిరంజీవి నిర్ణయించుకున్నారు.
Also Read: ఇండస్ట్రి పెద్దగా ఉండనంటున్న మెగాస్టార్ చిరంజీవి… ఇంకా ఏం అన్నారంటే ?
అసలు చిరంజీవి చేసిన తప్పు ఏమిటి ?
మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు ఉన్న వ్యక్తి. శత్రువుకి కూడా సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి. ఈ కరోనా కాలంలో మెగాస్టార్ చేసిన సేవ మరో హీరో చేయలేదు. కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో ముఖ్యంగా సినిమా జూనియర్ ఆర్టిస్ట్ లకు, సినీ కార్మికులకు ఆర్ధిక సాయం చేశారు. వారి ఆకలి కడుపులకు అన్నం పెట్టారు.
అలాగే ఆరోగ్యపర ఇబ్బందులతో నలిగిపోతున్న ప్రతి నటుడికి, సాంకేతిక నిపుణిడికి చిరంజీవి నేటికీ ఆర్థికంగా అండగా నిలబడుతూనే ఉన్నారు. ఇక ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంలో కూడా మొదట స్పందించింది చిరంజీవి ఒక్కరే. పైగా ఎప్పటికప్పుడు చొరవ చూపుతూ సినిమా ఇండస్ట్రీ మేలు కోసం చిరు తపిస్తూనే ఉన్నారు. మరి ఇక చిరంజీవి చేసిన తప్పు ఏమిటి ?
Also Read: రాహు కేతు పూజలు చేస్తోన్న బూతుల హీరోయిన్ !