CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. పరిపాలనలో ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సినిమా టికెట్ల వ్యవహారంలో పరిశ్రమను ముప్పతిప్పలు పెడుతున్న ప్రభుత్వం పేదవాడిని ఎరగా చూపుతోంది. కానీ సినిమా పరిశ్రమను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందనే విమర్శలు మూటగట్టుకుంది. పేదవాడికి వినోదం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే టికెట్ల రేట్లు తగ్గించినట్లు చెబుుతున్నా ఏపీలో చాలా వాటి రేట్లు ఎక్కువగా ఉన్నా ఒక్క సినిమానే ఎందుకు ఎంచుకున్నట్లు అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
ఏపీలో పెట్రో ధరలు అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటిని తగ్గించేందుకు మాత్రం ఎందుకు ముందుకు రావడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా రెట్టింపయ్యాయి. ఉపాధి కూడా లేకుండా పోతోంది. కానీ వీటిపై దృష్టి సారించని ప్రభుత్వం ఎందుకు సినిమా టికెట్ల పై తమ ప్రతాపం చూపిస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: రాహు కేతు పూజలు చేస్తోన్న బూతుల హీరోయిన్ !
పేదవాడి గురించే నిర్ణయాలు తీసుకుంటున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. వైసీపీ సినిమాను నిలదొక్కుకోకుండా చేయడమే ధ్యేయంగా పని చేస్తుందని తెలుస్తోంది. దీని కోసమే సినిమా టికెట్ల రేట్లు తగ్గించి సినిమాలు నడవకుండా కుట్రకు పాల్పడుతోందని తెలుస్తోంది. అదే పక్క రాష్ర్టమైన తెలంగాణలో సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే.
రాజకీయాలను అడ్డం పెట్టుకుని సినిమా రంగాన్ని నిర్వీర్యం చేయాలని భావిస్తోంది. అందుకే సినిమా టికెట్ల రేట్లు భారీగా తగ్గించి థియేటర్లు బంద్ చేయడానికి కారణమైంది. దీంతో అగ్రహీరోలు రంగంలోకి దిగినా ఫలితం మాత్రం కనిపించలేదు. సీఎం జగన్ సినిమా పరిశ్రమను దెబ్బ కొట్టాలని చూస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సినిమా రంగాన్ని టార్గెట్ గా చేసుకోకుండా వారి ఉపాధిని దెబ్బతీయకుండా ఉంటేనే మనుగడ సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాల్సిందే.
Also Read: ‘గంటా’ స్కెచ్.. జనసేనాని పవన్ ను కింగ్ మేకర్ గా నిలబెడతాడట?