‘అంతన్నాడు.. ఇంతన్నాడే పవన్ కళ్యాణ్.. చివరకు చేతులెత్తేసేడే.. ’ అని ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. గ్రేటర్ ఫైట్ కు జనసైనికులు ఉత్సాహం చూపిస్తున్నారని.. అక్కడి కార్యకర్తల అభీష్టం మేరకు జీహెచ్ఎంసీలో పోటీచేస్తానని సగర్వంగా ప్రకటించిన పవన్.. చివరకు నామినేషన్ వేసిన జనసేన కార్పొరేటర్ అభ్యర్థులను విత్ డ్రా చేసుకోవాల్సిందిగా కోరడం.. అంతకంటే అవమానం ఉండదని నెటిజన్లు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వెనకడుగు వేయడం.. బీజేపీకి చివరి నిమిషంలో లొంగిపోవడం.. ప్రణాళిక లేకుండా ఇలా చేయడం విమర్శల వాన కురుస్తోంది.
Also Read: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ ‘సోషల్’ వార్
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోని నాదెండ్ల మనోహర్ నివాసంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతివ్వాలని.. జనసేన తరుఫున పోటీ పెట్టవద్దని వారు కోరినట్లు తెలిసింది. ఈ సమావేశం అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి జనసేన వైదొలుగుతోందని.. బీజేపీకే పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. తాజా ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క ఓటు బయటకు పోవద్దని.. భవిష్యత్తులోనూ ఇరు పార్టీలు కలిసి వెళ్తాయని స్పష్టం చేశారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ నామినేషన్ల చివరి రోజు మాట మార్చేయడం జనసేన తరుఫున నామినేషన్లు వేసిన వారిని.. ఆ పార్టీని నమ్ముకొని ఉన్న హైదరాబాద్ నేతలు, కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది.కనీసం పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లల్లో పోటచేసినా పోయేది కదా అని వారంతా పవన్ ను ప్రశ్నిస్తున్నారట… తాము జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నామని.. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు పవన్ ప్రకటించడం ఇప్పుడు జనసైనికులు, అభిమానుల్లో ఆగ్రహానికి కారణమైందన్న వాదన వినిపిస్తోంది. ఈ ముక్క ఏదో మూడు రోజుల ముందే ప్రకటించి ఉంటే నామినేషన్ ఖర్చులైనా మిగిలేవి కదా అని వారంతా నినదిస్తున్నారట..
Also Read: సీఎం కేసీఆర్ vs భూపేందర్ యాదవ్.. ఎవరిది పైచేయి?
ఏపీ, తెలంగాణల్లో బీజేపీతో కలిసి పనిచేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అంతా అయిపోయాక సెలవిచ్చారు.గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన జనసేన.. నామినేషన్ వేసిన జనసేన అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జనసైనికులు నిరాశ పడొద్దన్న ఆయన.. ఈ ఒక్క ఓటు కూడా పోకుండా బీజేపీకి సహకరించాలని కోరారు. ప్రధాని మోడీ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందని.. హైదరాబాద్ లో బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరంతోనే తాము బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తున్నామని పవన్ ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్