80s Reunion: ప్రతీ ఏడాది 80s కాలానికి చెందిన హీరోలందరూ ఒక చోట రీ యూనియన్ అవ్వడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ రీ యూనియన్ లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi),విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), సురేష్, నరేష్, శరత్ కుమార్, భాను చందర్, తమిళ నటుడు ప్రభు, రాధ, మీనా, రమ్య కృష్ణ, మలయాళం నటుడు జయ రామ్, హిందీ నటుడు జాకీ ష్రాఫ్, కుష్బూ తదితరులు ఈ రీ యూనియన్ ప్రోగ్రాం లో రెగ్యులర్ గా పాల్గొంటూ ఉంటారు. అలా ఈ ఏడాది కూడా వీళ్ళు రీ యూనియన్ అయ్యారు. అందుకే సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కాసేపటి క్రితమే దీని గురించి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘నా ప్రియమైన మిత్రులతో కలిసి ప్రతీ ఏడాది నేను జరుపుకునే రీ యూనియన్ ప్రోగ్రాం నాకు ఎన్నో తీపి జ్ఞాపకాలను అందిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు మేము రీ యూనియన్ అయినా అది కొత్తగానే ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
పైన చెప్పిన పేర్లలో మలయాళం నటుడు మోహన్ లాల్ పేరు మిస్ అయ్యింది. ప్రతీ ఏడాది ఆయన కూడా పాల్గొనేవాడు కానీ, ఈసారి ఎందుకో మిస్ అయ్యాడు. అదే విధంగా సీనియర్ హీరో సుమన్ కూడా ఈ ఏడాది మిస్ అయ్యాడు. అంతా బాగానే ఉంది కానీ, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ వంటి వారు కూడా 80s కాలానికి చెందిన వాళ్ళే కదా, వీళ్లేందుకు ఈ రీ యూనియన్ ప్రోగ్రాం లో భాగం అవ్వరు అనే సందేహం అందరిలోనూ ఎప్పటి నుండో ఉంది. చిరంజీవి, బాలకృష్ణ లకు ఒకరంటే ఒకరు పడట్లేదు, అందులో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్ గా అసెంబ్లీ సాక్షిగా నందమూరి బాలకృష్ణ చిరంజీవి పై చేసిన వ్యంగ్యాస్త్రాలు అందుకు ఒక ఉదాహరణ. చిరంజీవి కూడా చాలా ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చాడు.
ఒకప్పుడు బాలయ్య 80s రీ యూనియన్ ప్రోగ్రాం కి చిరంజీవి నన్ను పిలవలేదు అంటూ అసహనం కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. బాలయ్య కి, చిరంజీవి కి మధ్య పడట్లేదు కాబట్టి, ఈ ప్రోగ్రాం కి బాలయ్య రావట్లేదు అనుకుందాం, మరి అక్కినేని నాగార్జున చిరంజీవి కి సొంత సోదరుడితో సమానం కదా, ఆయనేందుకు ఈ కార్యక్రమం లో పాల్గొనడం లేదు?. ఎన్నో ఏళ్ళ నుండి ఈ రీ యూనియన్ కార్యక్రమం జరుగుతూ ఉంది, కానీ ఒక్కసారి కూడా నాగార్జున ఈ ప్రోగ్రాం లో పాల్గొనలేదు. దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అనేది ప్రస్తుతానికి మిస్టరీ నే. వెంకటేష్ మరియు నాగార్జున మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుందని, అందుకే నాగార్జున ఈ ప్రోగ్రాం కి దూరంగా ఉంటాడని కొంతమంది అంటుంటారు, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో ఎవరికీ తెలియదు.