Chiranjeevi and Srikanth Odela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు…కానీ వాళ్ళలో కొంతమందికి మాత్రమే గొప్ప ఇమేజ్ వస్తోంది. ఇక ‘దసర’ సినిమాతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న శ్రీకాంత్ ఓదెల సైతం ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మనకు ఎత్తుగా మారబోతున్నాయి… నానితో చేస్తున్న ప్యారడైజ్ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల చిరంజీవితో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు…
ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీదనే పూర్తి ఫోకస్ ని పెట్టాడు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఫిబ్రవరి నుంచి ఆయన బాబీ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. ఈ సినిమా 2026 డిసెంబర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ పూర్తయిన తర్వాత శ్రీకాంత్ ఓదెల తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ క్రమంలోనే చిరంజీవి శ్రీకాంత్ ఓదెలకు ఒక మాట ఇచ్చినట్టుగా తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల చేస్తున్న ప్యారడైజ్ సినిమా బోల్డ్ కంటెంట్ తెరకెక్కుతోంది. ఇక ఈ స్క్రిప్ట్ తో శ్రీకాంత్ ఓదెల సక్సెస్ ని సాధిస్తే పర్లేదు, ఒకవేళ ప్లాప్ టాక్ తెచ్చుకుంటే మాత్రం చిరంజీవి శ్రీకాంత్ ఓదెలకి హ్యాండ్ ఇచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయని పలువురు సినిమా మేధావులు సైతం తెలియజేస్తున్నారు.
ఇక చిరంజీవి మాత్రం శ్రీకాంత్ ఓదెల తో నువ్వు నాని తో చేస్తున్న సినిమా హిట్ కొట్టిన, కొట్టకపోయినా పర్లేదు కానీ నాతో చేసే సినిమాలో మాత్రం బూతులు లేకుండా చూసుకో అని చెప్పాడట… మొత్తానికైతే ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటం విశేషం…