Chiranjeevi : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్(Mark Shankar Pawanovich) సింగపూర్ లోని తన స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో చిక్కుకున్నాడు. ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా లో లీకై అభిమానులను భయబ్రాంతులకు గురి చేసింది. మంటల్లో చిక్కుకున్న మార్క్ శంకర్ ని స్కూల్ సిబ్బంది వెంటనే హాస్పిటల్ కి తరలించారని, హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు ఊపిరి తిత్తుల్లో పొగ చేరుకోవడంతో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యిందని, ఆ తర్వాత చికిత్స చేయడం తో ఆ సమస్య తొలగిందని, కాళ్లకు, చేతులకు గాయాలు అయ్యాయని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి సమాచారం వచ్చింది. ప్రస్తుతం అరకు పర్యటనలో గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్, ఈ కార్యక్రమాలను ముగించుకున్న వెంటనే సింగపూర్ కి ప్రత్యేక విమానం లో బయలుదేరాడు.
Also Read : రాజమౌళి చేసిన సినిమాల్లో చిరంజీవికి బాగా నచ్చిన సినిమాలు ఇవేనా..?
ఇకపోతే కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మీడియా కు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితి పై కీలక ప్రకటన చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘8 ఏళ్ళ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. కాళ్లకు స్వల్ప గాయాలు అవ్వడంతో శస్త్ర చికిత్స చేస్తున్నారు. అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. అప్పటి వరకు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన చెందుతున్న అభిమానులకు ఈ విషయం తెలిసిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కాసేపటి క్రితమే విశాఖ పట్నం విమానాశ్రయం నుండి సింగపూర్ కి ప్రత్యేక విమానం లో బయలుదేరాడు. ఈరోజు 12 గంటల తర్వాత కూడా అరకు లో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంది, కానీ అకస్మాత్తుగా ఈ ఘటన జరగడంతో బ్రిడ్జి ఓపెనింగ్ చేసి, గిరిజన గ్రామస్తులతో కాసేపు మాట్లాడి, అరకు హోటల్ నుండి పయనమయ్యాడు.
పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) మూవీ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. రెండు రోజుల పాటు ఆయన డేట్స్ ని కేటాయించాడు. వచ్చే నెల 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నెల 22 లోపు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు సింగపూర్ కి వెళ్లడంతో ఇవన్నీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా మే9న విడుదల అవ్వాల్సిన సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ సింగపూర్ నుండి ఎప్పుడు తిరుగు ప్రయాణం అవుతాడో తెలియనందున ఆయన తదుపరి కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం లేదు.
Also Read : అనిల్ రావిపూడి సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నటించనున్న స్టార్ హీరోయిన్…