Rajamouli and Chiranjeevi : సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది. ఇక్కడికి వచ్చి రాణించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యపడదు. ఇక్కడ సక్సెస్ రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని…ఒక్క అవకాశం రావడానికి కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే రావచ్చు. వాటన్నింటిని తట్టుకొని నిలబడిన వాళ్లు మాత్రమే ఇక్కడ సక్సెస్ ఫుల్ హీరోలుగా, దర్శకులుగా కొనసాగుతారు…
సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamoul)… ఇప్పటివరకు ఫెయిల్యూర్ అనేది లేని దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. బాలీవుడ్ లో సైతం తన మార్కు ను చూపిస్తూ భారీ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఒక్క సినిమాని డైరెక్షన్ చేసి సూపర్ సక్సెస్ ను కొట్టడం చాలా కష్టమైన ఈ రోజుల్లో రాజమౌళి ఇప్పటివరకు చేసిన 12 సినిమాలతో మంచి విజయాలను సాధించడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. అలాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేది వాస్తవం. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుని హీరోగా పెట్టి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే రాజమౌళి లాంటి దర్శకుడు చేస్తున్న ప్రతి సినిమా సక్సెస్ వెనుక కారణం ఏంటి అంటే అతని హార్డ్ వర్క్ అనే చెప్పాలి. అతను సినిమా కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడు. ఒకసారి సినిమాకి కమిట్ అయ్యాడు అంటే దాన్ని బ్లాక్ బస్టర్ గా నిలపడానికి శతవిధాలుగా ప్రయత్నం అయితే చేస్తూ ఆ సినిమాలోని ఎమోషన్స్ ను, ఎలివేషన్స్ పర్ఫెక్ట్ వే లోకి తీసుకొచ్చి భారీ విజయాలను అందుకుంటాడు.’
Also Read : ఆ విషయం లో రాజమౌళి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి…
ఇక రాజమౌళి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవికి నచ్చిన సినిమాలు ఏంటి అనే ప్రశ్న గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. ఇక ఆ సందర్భంలోనే రాజమౌళి చేసిన సినిమాల్లో తనకు బాగా నచ్చిన సినిమాలు ఏంటో చెప్పాడు.
మొదటగా ‘సింహాద్రి ‘ (Simhadri) సినిమా అంటే చిరంజీవికి చాలా ఇష్టమట. ఆ సినిమాలో రాజమౌళి ఎమోషన్స్ తో ఆడుకున్నాడు. ఇక ఆ సినిమా చూసినప్పుడు చిరంజీవికి చాలా ఆశ్చర్యం వేసిందట. ఎందుకంటే కొత్త డైరెక్టర్ అయి ఉండి చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా మాస్ సినిమాను హ్యాండిల్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉందని తన సన్నిహితుల దగ్గర మాట్లాడరట.
ఇక ఈ సినిమా తర్వాత ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర లాంటి సినిమాలు చిరంజీవికి విపరీతంగా నచ్చేశాయట. మొత్తానికైతే జక్కన్న చేసిన సినిమాల్లో సగం సినిమాలు చిరంజీవికి భారీగా నచ్చటమే కాకుండా రామ్ చరణ్ ను రాజమౌళి డైరెక్షన్ లో నటింపజేయాలనే ఆలోచన కూడా కలిగిందట. మొతానికైతే ఈ నాలుగు సినిమాలు చిరంజీవికి బాగా నచ్చిన సినిమాలని తెలుస్తున్నాయి…
Also Read : రాజమౌళి దర్శకత్వంలో నటించాలనే కోరిక లేదు.. షాకిచ్చిన చిరంజీవి