Prabhas : సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)…ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వైవిధ్యాన్ని సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతుండటం విశేషం… మరి ఇలాంటి క్రమంలోనే ఆయనతో సినిమాలు చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన మాత్రం తెలుగు డైరెక్టర్లతోనే సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. మరి ఇలాంటి క్రమంలో ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా కోసం అభిమానులైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒక స్టార్ డైరెక్టర్ ప్రభాస్ తో సినిమా చేయడం కోసం ఆయనకి 72 సార్లు ఒక కథను అయితే వినిపించారట. ప్రభాస్ కూడా ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని అనుకునే లోపే తన పక్కన ఉన్న ఒక వ్యక్తి ద్వారా ఆ సినిమాని రిజెక్ట్ చేయాల్సిన అవసరమైతే వచ్చిందంటూ ఆ దర్శకుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే రణం సినిమాతో దర్శకుడిగా మారిన అమ్మ రాజశేఖర్(Amma Rajashekar)… ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన చాలా తక్కువ సమయంలోనే దర్శకుడిగా మారాడు.
ఇక గోపీచంద్ (Gopi Chand) తో చేసిన రణం (Ranam) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో రవితేజతో ఖతర్నాక్ అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా కూడా ఆవరేజ్ గా ఆడింది. ఇక ఆ తర్వాత నితిన్ (Nithin)తో చేసిన టక్కరి సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలాపడ్డాడు.
అయితే ఖతర్నాక్ సినిమా అయిపోయిన తర్వాత ప్రభాస్ కి అమ్మ రాజశేఖర్ ఒక కథను వినిపించారట. దాదాపు 72 సార్లు అదే కథని కంటిన్యూస్ గా అతనికి చెబుతూ ఉన్నాడట. ఇక ఆల్మోస్ట్ ప్రభాస్ కూడా ఆ స్టోరీకి ఓకే చేసినప్పటికీ తన పక్కన ఉన్న ఒక వ్యక్తి కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లుగా మారితే పర్లేదు కానీ మధ్య మధ్యలో కొన్ని సినిమాలు కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు.
అలాంటి వాళ్ళు మన సినిమాను మధ్యలో వదిలేసే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళని మనం నమ్మలేము అంటూ ఆయన ప్రభాస్ కి కొన్ని మాటలైతే చెప్పాడట. దాంతో ప్రభాస్ ఆ స్టోరీ ని రిజెక్ట్ చేశారు అంటూ రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. మరి ఇంతకీ అలా చెప్పిన వ్యక్తి ఎవరు అనే విషయాన్ని బయట పెట్టలేదు. కానీ ప్రభాస్ వాళ్ళ వల్లే తన సినిమాను రిజెక్ట్ చేశారంటూ ఆయన చెప్తూ ఉండడం విశేషం…