Chiranjeevi And Rajinikanth: గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి…70 సంవత్సరాల వయసులో కూడా ఆయన కుర్ర హీరోలకు పోటీని ఇస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఇక ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో చేయబోయే సినిమా కోసం ఆయన జిమ్ కి వెళ్లి మరి తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు. ఆ సినిమాలో 50 సంవత్సరాలు పైబడిన వయసు గల క్యారెక్టర్ లో చిరంజీవి కనిపించబోతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఈ సినిమా అతనికి ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసి పెడుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికి ఆయన అనుకుంటే ఈ ఏజ్ లో సినిమాలు చేయాల్సిన పనిలేదు. ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తూ కాలాన్ని గడపొచ్చు. కానీ మనం ఎవరి కంటే తక్కువ కాదు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి ఇంకా మనం చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజనీకాంత్ సైతం ప్రస్తుతం సోలో హీరోగా అలరిస్తున్నాడు. ‘జైలర్ 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకుడి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా చిరంజీవి రజనీకాంత్ ను కలిసినప్పుడు సినిమాల విషయంలో రజనీకాంత్ చిరంజీవికి కొన్ని సలహాలైతే ఇచ్చారట.
అవి ఏంటి అంటే ఈ ఏజ్ లో డిఫరెంట్ సినిమాలని చేయాలని రొటీన్ రెగ్యులర్ సినిమాలు చేయడం కంటే మనం ఇంతకుముందు చేయని పాత్రలు ఏంటో తెలుసుకొని ఆ క్యారెక్టర్ ను చేయగలిగితే బాగుంటుంది అంటూ చెప్పారట. చిరంజీవి కూడా దానికి ఎస్ చెప్పినట్టుగా తెలుస్తుంది.
ఇక రాబోయే రోజుల్లో వీళ్లిద్దరి నుంచి వైవిధ్య భరితమైన సినిమాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…చూడాలి మరి రాబోయే రోజుల్లో వాళ్ల నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అనేది…
