https://oktelugu.com/

Chiranjeevi- NTR: తార‌క్ తో పోటీ వ‌ద్ద‌ని సినిమా వాయిదా వేసుకున్న చిరు.. అస‌లేమైందంటే..?

Chiranjeevi- NTR: సినీ ఇండ‌స్ట్రీలో ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు పోటీ ప‌డ‌టం కామ‌న్‌. అయితే చిరంజీవి, కృష్ణ త‌రంలో ఇలాంటివి ఎక్కువ‌గానే ఉండేవి. ఆ స‌మ‌యంలో వారి మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క‌పోటీ త‌త్వం ఉండేది. త‌ర్వాత మెగాస్టార్‌గా చిరంజీవి ఎవ్వ‌రూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. కాగా అలాంటి చిరంజీవి జూనియ‌ర్ ఎన్టీఆర్ మూవీ వ‌స్తోంద‌ని త‌న సినిమాను వాయిదా వేసుకున్నారంట‌. అదేంటి.. అలా ఎందుకు చేశారు అనే క‌దా మీ డౌట్‌. దానికి క్లారిటీ తెలుసుకుందాం. 2002లో […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 21, 2022 / 12:37 PM IST
    Follow us on

    Chiranjeevi- NTR: సినీ ఇండ‌స్ట్రీలో ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు పోటీ ప‌డ‌టం కామ‌న్‌. అయితే చిరంజీవి, కృష్ణ త‌రంలో ఇలాంటివి ఎక్కువ‌గానే ఉండేవి. ఆ స‌మ‌యంలో వారి మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క‌పోటీ త‌త్వం ఉండేది. త‌ర్వాత మెగాస్టార్‌గా చిరంజీవి ఎవ్వ‌రూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. కాగా అలాంటి చిరంజీవి జూనియ‌ర్ ఎన్టీఆర్ మూవీ వ‌స్తోంద‌ని త‌న సినిమాను వాయిదా వేసుకున్నారంట‌. అదేంటి.. అలా ఎందుకు చేశారు అనే క‌దా మీ డౌట్‌. దానికి క్లారిటీ తెలుసుకుందాం.

    2002లో డైరెక్ట‌ర్ బి.గోపాల్ ఒకేసారి రెండు సినిమాల‌ను తెర‌కెక్కించారు. మెగాస్టార్ తో ఇంద్ర మూవీని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో అల్ల‌రి రాముడు సినిమాల‌ను మేకింగ్ చేశారు. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా ఆర్తి అగ‌ర్వాల్ న‌టించింది. కానీ స‌క్సెస్ రేటు ప‌రంగా ఎన్టీఆర్ ముందున్నాడు. ఎన్టీఆర్ అంత‌కు ముందు ఆది లాంటి సూప‌ర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు.

    Chiranjeevi- NTR

    Also Read: Raveena Tandon: పార్టీలో రచ్చ.. కేకలు పెట్టిన సీనియర్ హీరోయిన్ !

    పైగా దానికంటే ముందు కూడా కొన్ని మంచి హిట్లు అత‌ని ఖాతాలో ఉన్నాయి. కానీ చిరంజీవి మాత్రం డాడీ, శ్రీ మంజునాథ‌, మృగ‌రాజు లాంటి ప్లాపుల‌తో ఫామ్ కోల్పోయారు. వ‌రుస‌గా మూడు ప్లాపులు రావ‌డంతో చిరంజీవిపై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఇలాంటి స‌మ‌యంలో జూలై 18న ఒకేరోజు రెండు సినిమాల‌ను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు.

    Chiranjeevi- NTR

    దాంతో చిరంజీవి ఒక అడుగు వెన‌క్కేసి ఎన్టీఆర్‌తో పోటీ నుంచి తప్పుకున్నారు. ఎందుకంటే అల్ల‌రి రాముడు హిట్ అయి ఇంద్ర గ‌న‌క ప్లాప్ అయితే చిరంజీవి ఇమేజ్ దెబ్బ తింటుంద‌ని ఇండ‌స్ట్రీలో అప్ప‌టికే టాక్ న‌డుస్తోంది. అదే నిజం అయితే త‌న కొడుకు వ‌య‌సున్న హీరో చేతిలో ఇమేజ్ పోగొట్టుకునే ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని చిరంజీవి వారం రోజుల గ్యాప్ త‌ర్వాత మూవీని రిలీజ్ చేయించారంట‌.

    కానీ విచిత్రంగా అల్ల‌రి రాముడు మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. వారం త‌ర్వాత వ‌చ్చిన ఇంద్ర బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. ఈ మూవీ చిరు కెరీర్‌లో ఓ మైల్ స్టోన్‌గా నిలిచింది. దీంతో చిరు ఇమేజ్ మ‌ళ్లీ పెరిగింది. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే చిరు ఇంద్ర మూవీ గ‌న‌క లేక‌పోతే ఎన్టీఆర్ చేసిన అల్ల‌రి రాముడు యావ‌రేగ్ గా ఆడేది. కానీ ఇంద్ర ఎఫెక్ట్ తో డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది.

    Also Read:Netflix: అన్నీ ఓటీటీలు దూసుకెళుతుంటే నెట్ ఫ్లిక్స్ ఎందుకు దూరమవుతోంది!

    Recommended Videos:

    Tags