ఈరోజు రాఖీ పండుగ.. పైగా చిరంజీవి పుట్టినరోజు. అందుకే మెగా ఇంట అతిపెద్ద పండుగ మొదలైంది. రాఖీ పండుగను, అలాగే చిరంజీవి పుట్టినరోజును ఆయన ఇంట్లో ఘనంగా జరుపుకున్నారు. చిరంజీవి బర్త్ డే, రాఖీ పండుగ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ పండుగ కూడా కలిసి రావడంతో మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు ముగ్గురు సోదరులకు వారి సోదరీమణులతో రాఖీ కట్టించుకున్నారు.
ఈ సందర్భంగా ‘‘అన్నయ్యను ఆరాధించే లక్షలాది మందిలో నేను తొలి అభిమానిని.. ఆయననాకేకాదు.. ఎందరికో మార్గదర్శి, స్ఫూర్తి ప్రధాత, ఆదర్శ ప్రాయుడు. ఆపదలో ఉన్నోళ్లను ఆదుకోవడానికి ముందుంటారు. దానాలు , గుప్తదానాలెన్నో చేశారు. మా కుటుంబంలో అన్నయ్యగా పుట్టిన మమ్మల్ని తండ్రిగా సాకారు. తండ్రి స్థానంలో నిలిచారు’ అని పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవి, పవన్, నాగబాబు, ఆయన చెల్లెల్లతో ఆ ఇంటి ఘనంగా సందడి నెలకొంది. ఆ వేడుకల వీడియోను కింద మీరు చూడొచ్చు.