శరీర ఉష్ణోగ్రతను తులసి నీళ్లు అదుపులో ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వాళ్లు తులసి నీళ్లను తాగితే సులభంగా బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. పసుపు, తులసి కషాయాలు తీసుకోవడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం. ఎసిడిటీ సమస్యతో బాధ పడేవాళ్లు రోజుకు రెండు లేదా మూడు తులసి ఆకులను తినడం ద్వారా ఆ సమస్య దూరమవుతుంది.
సీజనల్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడంలో తులసి ఆకు సహాయపడుతుంది. రోజూ ఆహారంతో పాటు తులసి ఆకులను తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. తులసి ఆకులను రోజూ తీసుకోవడం ద్వారా శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగించడంతో పాటు జీర్ణక్రియ సమస్యలను తగ్గించడంలో తులసి ఆకులు సహాయపడతాయి.
మలబద్ధకం, విరేచనాల సమస్యకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుంది. ఉదయాన్నే తులసి నీళ్లు తాగడం వల్ల వైరల్ ఫీవర్, జ్వరం బారిన పడే అవకాశాలు అయితే తగ్గుతాయి. తులసి ఆకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో పరగడుపున తులసి నీళ్లు తాగితే మంచిదని చెప్పవచ్చు.