
Chiranjeevi – Pawan Kalyan : మెగా ఫ్యామిలి లో ఒక హీరోకి సంబంధించిన సినిమాలు ఒకే సమయం లో విడుదలైనట్టు చరిత్ర లో లేదు.కానీ ఈసారి మాత్రం ఒకే సమయం లో విడుదల చేసి పోటీ పడక తప్పేలా లేదు.’వాల్తేరు వీరయ్య ‘ సక్సెస్ తో మంచి ఊపు మీదున్న మెగాస్టార్ చిరంజీవి, తన తదుపరి చిత్రం మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది.తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదాళం’ చిత్రానికి ఇది రీమేక్.
మరో పక్క పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ రీమేక్ లో నటిస్తున్నాడు.ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.
ఈ సినిమా షూటింగ్ కూడా గత రెండు రోజుల నుండి హైదరాబాద్ లో జరుగుతుంది.ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడు.పూర్తి షూటింగ్ మూడు నెలలు లోపే పూర్తి చేసి ఆగష్టు 11 వ తేదీన విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.మరో పక్క మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాని కూడా అదే రోజు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఆగష్టు 11 వ తేదీన విడుదల చేస్తే వీకెండ్ తో పాటుగా ఆగష్టు 15 వ తేదీ కూడా పబ్లిక్ హాలిడే కూడా కలిసి వస్తుందని, అతి తేలికగా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి రావొచ్చు అని ఈ డేట్ కి అన్నదమ్ములు ఇద్దరు రావాలని పోటీపడుతున్నారు.కానీ చివరికి ఒకరే వస్తారా..లేదా ఇద్దరు కలిసి వస్తారా అనేది చూడాలి.అభిమానులు అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు రాకూడదని కోరుకుంటున్నారు, మరి ఏమి జరగబోతుందో చూడాలి.