https://oktelugu.com/

Taraka Ratna : పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో వరుసగా అవకాశాలు సంపాదించిన తారకరత్న..ఇంతలోపే ఇలా జరిగింది!

Taraka Ratna : నందమూరి తారకరత్న చనిపోయిన ఘటన నుండి ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తేరుకోలేదు.నందమూరి కుటుంబం మొత్తం శోకసంద్రం లో మునిగిపోయింది.వాళ్ళు మళ్ళీ ఎప్పుడు మామూలు మనుషులు అవుతారో చెప్పలేని పరిస్థితి.ఇదంతా పక్కన పెడితే తారకరత్న గురించి మానెవ్వరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు రోజుకి ఒకటి సోషల్ మీడియా లో లీక్ అవుతూ వైరల్ గా మారాయి.అవేంటో ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఇక అసలు విషయానికి వస్తే తారకరత్న మంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 25, 2023 / 10:02 PM IST
    Follow us on

    Taraka Ratna : నందమూరి తారకరత్న చనిపోయిన ఘటన నుండి ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తేరుకోలేదు.నందమూరి కుటుంబం మొత్తం శోకసంద్రం లో మునిగిపోయింది.వాళ్ళు మళ్ళీ ఎప్పుడు మామూలు మనుషులు అవుతారో చెప్పలేని పరిస్థితి.ఇదంతా పక్కన పెడితే తారకరత్న గురించి మానెవ్వరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు రోజుకి ఒకటి సోషల్ మీడియా లో లీక్ అవుతూ వైరల్ గా మారాయి.అవేంటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    ఇక అసలు విషయానికి వస్తే తారకరత్న మంచి నటుడు.ఆయన నటనకి తగ్గ సక్సెస్ మాత్రం సినిమా ఇండస్ట్రీ లో రాలేదు.హీరో గా చేసిన 20 సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.కానీ నెగటివ్ రోల్స్ మాత్రం అతనికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.ముఖ్యంగా ‘అమరావతి’ సినిమాలో ఆయన పోషించిన పాత్రకి నంది అవార్డు కూడా దక్కింది.ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

    అయితే ఇప్పుడు తారకరత్న కి సినిమాల పరంగా మంచి ఆఫర్లు వచ్చాయి..బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో తారకరత్న కి మంచి రోల్ ఇచ్చారట.అంతే కాదు 400 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరో గా ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ లో కూడా తారకరత్న కి అద్భుతమైన రోల్ డిజైన్ చేశారట.ఈ విషయాన్నీ తారకరత్న కి త్వరలోనే చెపుదాం అనుకునేలోపే ఆయనకీ ఇలా జరిగింది అంటూ అశ్విని దత్ బాధపడ్డాడు.

    కేవలం సినిమాల పరంగా మాత్రమే కాదు, రాజకీయపరంగా కూడా తారకరత్న తెలుగు దేశం పార్టీ లో చేరి, ఉన్నత పదవులను అధిరోహించడానికి సన్నాహాలు చేసుకున్నాడు.MLA గా రాబొయ్యే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలవాలనుకున్నాడు.కానీ ఇంతలోపే జరగాల్సింది అంతా జరిగిపోయింది.సరిగ్గా ఉన్నత శిఖరాలకు చేరుకునే దిశగా అడుగులు వేస్తున్న సమయం లోనే తారక రత్న ని ఆ దేవుడు పైకి తీసుకెళ్లిపోయాడు అంటూ అభిమానులు బాధపడుతున్నారు.