Chiranjeevi and Nayanthara : సౌత్ ఇండియా లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో నయనతార(Nayanathara) పేరు కచ్చితంగా ఉంటుంది. ఈమె మన తెలుగు ఆడియన్స్ కి మొట్టమొదటిసారిగా చంద్రముఖి చిత్రం తో పరిచయమైంది. ఆ తర్వాత ఆమె ప్రయాణం ఎలా సాగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మన టాలీవుడ్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. కానీ ఎక్కువగా ఆమె తమిళ చిత్ర పరిశ్రమకే పరిమితమైంది. ఇకపోతే రీసెంట్ గానే ఆమె మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) చిత్రం లో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ఆమె 18 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసింది అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియా లో జరిగిన ఒక ప్రచారం సంచలనం గా మారింది.
Also Read : చిరంజీవి కి చుక్కలు చూపించిన నయనతార..ఇలాంటి డిమాండ్స్ ఎవ్వరూ చేసుండరు!
కానీ అందులో ఎలాంటి నిజం లేదని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. కేవలం ఆమె ఆరు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే ఈ సినిమా కోసం తీసుకుందట. వాస్తవానికి నయనతార తన ప్రతీ సినిమాకు పది కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటూ ఉంటుంది. కానీ చిరంజీవి కోసం ఆమె ఇంత తక్కువ రెమ్యూనరేషన్ కి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఆమె ఒక సినిమాకు అగ్రిమెంట్ చేసే ముందు కొన్ని షరతులు ఉంటాయి. వాటిల్లో మొదటిది ప్రొమోషన్స్ లో పాల్గొనే సమస్యే లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా రాను అని. కారణం ఏంటో తెలియదు కానీ, ఇది ఆమెకు ఆమె వేసుకున్న ప్రామిస్. మెగాస్టార్ చిరంజీవి తో ఇప్పటి వరకు నయనతార ‘సైరా నరసింహా రెడ్డి’, ‘గాడ్ ఫాదర్’ వంటి చిత్రాలు చేసింది. ఈ రెండు సినిమాల విడుదల సమయంలో ఆమె ప్రొమోషన్స్ లో పాల్గొనలేదు.
కానీ ఈ చిత్రం కోసం మాత్రం ఆమె ఆ ఆంక్షలను తీసేసింది. ఎందుకంటే అనిల్ రావిపూడి సినిమా అంటే ప్రొమోషన్స్ చాలా భిన్నంగా, క్రేజీ గా ఉంటాయి. కేవలం ప్రొమోషన్స్ తోనే ఆయన ఆడియన్స్ కి తన సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి ని కలిగించేలా చేస్తుంటాడు. అందుకే అనిల్ రావిపూడి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం తో నయనతార అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. త్వరలోనే నయనతార మా సినిమాలో భాగం కాబోతుంది అంటూ మూవీ టీం అధికారికంగా ప్రకటించబోతుంది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి మొదలు పెట్టనున్నారు. కేవలం మూడు నెలల్లోనే సినిమాని పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
Also Read : 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించను అంటూ నయనతార షాకింగ్ కామెంట్స్..ఇంత పగ ఎందుకు?