Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనేది ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కల…ఇతర హీరోలతో సినిమాలను చేసే దర్శకులు సైతం అతనితో ఒక సినిమా చేస్తే చాలు అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం అతడితో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా కూడా వదులుకున్నారు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే దర్శకధీరుడు రాజమౌళి కాగా, మరొకరు తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కావడం విశేషం… అయితే చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్నప్పుడు రాజమౌళితో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ రాజమౌళి మాత్రం అప్పటికే తను ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల చిరంజీవి సినిమాను పట్టించుకోలేదు.
ఇక ఆ సమయంలోనే శంకర్ ని కూడా అడిగారట. కానీ శంకర్ బిజీగా ఉండడం వల్ల చిరంజీవి సినిమా మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు. ఇక శంకర్ బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలను చేశాడు మొత్తానికైతే చిరంజీవిని రిజెక్ట్ చేసిన ఇద్దరు దర్శకులుగా రాజమౌళి, శంకరు లు మిగిలిపోవడం విశేషం…
శంకర్ తో గతంలో కూడా చిరంజీవి సినిమా చేయాలని చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ తో అవకాశం వస్తే ఎగిరి గంతేసే దర్శకులు ఉన్న ఈ రోజుల్లో రాజమౌళి, శంకర్ లు మాత్రం చిరంజీవి ని అసలు పట్టించుకోలేదు. అతనితో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదనే విషయాన్ని తెలుసుకున్న చాలామంది చిరంజీవి అభిమానులు సైతం నిరుత్సాహపడుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి స్టార్ హీరో ఇప్పటికి కుర్ర హీరోల్లా కష్టపడుతూ తనను తాను మౌల్డ్ చేసుకోవడానికి ఆరాటపడుతున్నాడు. కుర్ర హీరోలకు సైతం పోటీని ఇస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి చిరంజీవి రాబోయే రోజుల్లో మరిన్ని సూపర్ సక్సెస్ లను సాధిస్తూ తన అభిమానులను, ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక భారీ కమర్షియల్ సినిమా చేస్తుండటం విశేషం…