Chiranjeevi: గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి…ఇండస్ట్రీకి రావడం అనేది అంత ఆశమాషి వ్యవహారం కాదు. కానీ ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని టాప్ రేంజ్ కి వెళ్ళినా నటుడు కూడా చిరంజీవే కావడం విశేషం… ఇక చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో చాలా సినిమాలు చేశాడు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు అతనికి మంచి గుర్తింపైతే లభించింది. కెరియర్ స్టార్టింగ్ లో చేసిన మాస్ సినిమాలు అతన్ని టాప్ హీరోగా నిల్చోబెట్టాయి. మొత్తానికైతే మెగాస్టార్ అనే ఒక ట్యాగ్ ను కూడా వచ్చేలా చేశాయి. అలాంటి నటుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు… ఇక కెరియర్ స్టార్టింగ్ లో మీసాలు తీసేయడానికి చాలా వరకు చిరంజీవి ఇబ్బంది పడేవాడు. అసలు ఎప్పుడు ఆ సందర్భం కూడా అతనికి రాలేదనే చెప్పాలి.
కానీ జంధ్యాల డైరెక్షన్ లో చేసిన ‘చంటబ్బాయి’ సినిమా విషయంలో చార్లీ చాప్లిన్ గెటప్ వేయాల్సి వచ్చినప్పుడు, అలాగే ఆ సినిమాలో ఒక చిన్న లేడీ టైప్ పాత్ర కూడా వేయాల్సి ఉంటుంది. ఆ రెండు పాత్రల కోసం చిరంజీవిని మీసాలు తీసేయమని జంధ్యాల గారు చెప్పారట. దానికి చిరంజీవి ఈయనేంటి ఇలా చెప్తున్నాడని షాక్ అయ్యాడట.
ఎందుకంటే మీసాలు తీసేస్తే తను బాగుండడనే ఉద్దేశ్యంలో చిరంజీవి ఉన్నాడు. కానీ తప్పదు కాబట్టి చిరంజీవి ఒక కండిషన్ పెట్టాడట. ఏంటా కండిషన్ అంటే తను మీసాలు తీసేసి యాక్టింగ్ చేసేటప్పుడు సెట్ లో ఉన్నవాళ్ళందరూ తమ మీసాలను తీసేయాలని చెప్పాడట. కారణం ఏంటంటే ఎవరి మీసాలు వాళ్ళు తీసేసుకుంటే ఒకరినొకరు చూసుకున్న పెద్దగా కొత్తదనం ఏమీ ఉండదు.
అందరికి మీసాలు లేవు కదా అనే ఫీల్ ఉంటుంది. దానివల్ల ఎవరికి అక్కడ ఉన్న వాళ్లకు చిరంజీవి మీసాలు తీసేసాడు అనే ఫీల్ రాదనే ఉద్దేశ్యంతోనే ఆయన అలా చెప్పారట. మొత్తానికైతే జంధ్యాల సెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఆర్డర్ వేసి ప్రతి ఒక్కరు మీసాలు తీసేసేలా ఏర్పాటు చేశాడు. మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్లు వచ్చిన ‘చంటబ్బాయి’ సినిమా భారీ సక్సెస్ ని సాధించకపోయినా కూడా అది చిరంజీవి కెరియర్ లో ఒక క్లాసిక్ సినిమాగా మిగిలిపోయింది…