Chiranjeevi met Varunavi: జీ తెలుగు ఛానల్ లో ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘సరిగమప లిటిల్ ఛాంప్స్'(Sarigamapa Little Champs) ప్రోగ్రాం కి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో లో చిన్నారులు పాడే పాటలు వింటే చెవుల్లో అమృతం పోసినట్టుగా అనిపిస్తాది. ముఖ్యంగా ‘వరునవి'(Varunavi) అనే అమ్మాయి గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ చిన్నారి కి కళ్ళు కనిపించవు. కానీ అద్భుతంగా పాటలు పాడుతుంది, అదే విధంగా అద్భుతంగా కామెడీ కూడా చేస్తుంది. ఈమె కామెడీ టైమింగ్ ని చూస్తే, ఇంత చిన్న అమ్మాయికి ఇంత పరిణీతి ఎలా సాధ్యమైంది?, దేవుడు ఆ బిడ్డకు కళ్ళు ఇవ్వకపోయినా, బోలెడంత తెలివి ఇచ్చాడని ఈ షోలో ఆ అమ్మాయిని చూసిన ప్రతీ ఒక్కరు అంటుంటారు. ఇకపోతే ఈ షోకి యాంకర్ గా సుడిగాలి సుధీర్ వ్యవహరిస్తుండగా, SP శైలజ, అనిల్ రావిపూడి మరియు అనంత్ శ్రీరామ్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం ఈ నెల 12 న విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ శనివారం రోజున ‘సరిగమప లిటిల్ చాంప్స్’ ప్రోగ్రాం లో వరునవి అనిల్ రావిపూడి ని రిక్వెస్ట్ చేస్తూ ‘అనిల్ మామ, నన్ను చిరంజీవి(Megastar Chiranjeevi) మామ దగ్గరకు తీసుకొని వెళ్ళు’ అని అడుగుతుంది. నీకోసం ఇప్పుడే చిరంజీవి గారి వద్ద అపాయింట్మెంట్ తీసుకుంటాను అని అనిల్ రావిపూడి చెప్తూ, వెంటనే చిరంజీవి కి ఫోన్ చేయడం, ఆయన అంగీకరించి వరునవి ని తీసుకొని రమ్మనడం, ఆ తర్వాత అనిల్ రావిపూడి, సుడిగాలి సుధీర్, అనంత్ శ్రీరామ్ ముగ్గురు కలిసి వరునవి తో చిరంజీవి దగ్గరకు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి తో సరదాగా ఈ చిన్నారి జరిపిన సంభాషణ చూస్తే ప్రతీ ఒక్కరికీ ఆనందం తో కూడిన కన్నీళ్లు బయటకు వస్తాయి.
చిరంజీవి ఈ చిన్నారి ని చూడగానే ‘నువ్వు ఎలా ఉన్నవో తెలుసా చూస్తుంటే, అచ్చం నెమలి లాగా ఉన్నావు’ అని అంటాడు. అప్పుడు వరునవి ‘చిరు సార్..మీకోసం నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను’ అని అంటుంది. అప్పుడు చిరంజీవి ‘చెప్పు నాన్న’ అని అనగా, ‘రికార్డుల్లో మీ సినిమా ఉండడం కాదు, మీ సినిమా మీదనే రికార్డ్స్ ఉంటాయి’ అని డైలాగ్ చెప్తుంది వరునవి. ఈ వీడియో మొత్తం చూసే ఆడియన్స్ కి ఎదో తెలియని అనుభూతిని ఇస్తుంది. అంతే కాదు , ఆ చిన్నారికి కళ్ళు వచ్చేందుకు తన వంతుగా ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని చిరంజీవి మాట ఇవ్వడాన్ని చూసి సోషల్ మీడియా లో అభిమానులు గర్వపడుతున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
I will take care of everything, she needs ♥️.
– Mega Star #Chiranjeevi
pic.twitter.com/PNQFSyYfC9— Telugu Chitraalu (@CineChitraalu) January 7, 2026